ఈవీఎంల ట్యాంపరింగ్‌.. వద్దేవద్దంటున్న విపక్షాలు?

గెలిచినపుడు ప్రజాభిమానం, ఓడినపుడు ఈవీఎంల ద్వారానే ఓటమి చెందామని రాజకీయ పార్టీలు అనడం సర్వసాధారణం అయిపోయింది. ఈవీఎంలు వద్దని బ్యాలెట్ల ద్వారానే ఎన్నికలు జరపాలని దేశంలోని రాజకీయ పార్టీలు పట్టుబడుతున్నాయి. దీనికి ఎన్సీపీ అధినేత శరద్ పవర్ నాయకత్వం వహిస్తున్నారు.  ఎన్నికల్లో ఈవీఎంల గురించి నెలకొన్న ఆందోళనపై ఎన్నికల కమిషన్ ను గట్టిగా ప్రశ్నించనున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతలతో ఇటీవల శరద్ పవర్ సమావేశమయ్యారు.

ఈవీఎం మిషన్ల సామర్థ్యంపై అభ్యంతరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, స్వతంత్ర నేత కపిల్ సిబాల్, సమాజ్ వాదీ నేత రామ్ గోపాల్ యాదవ్ శివసేన నుంచి అనిల్ దేశాయ్, బీఆర్ ఎస్ నుంచి కె. కేశవరావులు శరద్ పవార్ తో సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. వలస ఓట్లర గురించి రిమోట్ ఓటింగ్ ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని దిగ్విజయ్ సింగ్ సమావేశం అనంతం పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

ఈవీఎం విషయంలో డెమోను అంగీకరించమన్నారు. గతంలో ఈవీఎంలు అంటే ఒక్క యంత్రం ఉండేది. ఇప్పడు ఈవీఎంలలో పేర్లను ఆన్ లైన్ లో చేర్చవచ్చని అంటున్నారు. ఎన్నో సందేహాలతో ఈసీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి .లోకూర్ నేతృత్వంలోని సిటిజన్ కమిషన్ ఆప్ ఎలక్షన్స్ ఫిర్యాదు చేసింది. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఈవీఎంలను వాడటం లేదని కపిల్ సిబాల్ అన్నారు.  

అత్యంత విచిత్రమైన విషయం ఈ ఈవీఎంలను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే. ఈవీఎంలు ప్రవేశపెట్టిన సమయంలో ఎంపీగా ఉన్న కపిల్ సిబాల్ ప్రస్తుతం వాటిని వద్దని వ్యతిరేకిస్తున్నారు. ఒడ్డు దాటే దాకా ఓడ మల్లన్న దాటాక బోడి మల్లన్న గా తయారైంది దేశంలోని విపక్షాల పరిస్థితి. ఈవీఎంలదే పొరపాటు అయితే ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

EVM

సంబంధిత వార్తలు: