
చంద్రబాబు జోష్.. జగన్ భయపడుతున్నాడా?
వైసీపీ పార్టీలో ఇప్పటి వరకు నోరు మెదపనోళ్లు ప్రస్తుతం బయటకు వ్యాఖ్యలు చేస్తున్నారు. కారణం వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం, సంఖ్యా బలం ఉండి, అధికారం చేతిలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటివరకు పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇలా ఏ ఎన్నికల్లో అయినా విజయభావుటా ఎగరవేసిన వైసీపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటమితో కుంగిపోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని భావిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే సాధారణ ఎన్నికలకు గీటురాయి లాంటివని టీడీపీ నమ్ముతోంది. ఇదే సీను రీపీట్ అవుతుందని భావిస్తోంది. వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామనే నమ్మకం ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో కలిగింది. వైసీపీ పార్టీ లో ఉన్న లుకలుకలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు వారి వెనక నిలుచున్న కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని వారు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో తీవ్రంగా కష్టపడిన వారు కూడా సఫర్ అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ కార్యకర్తలు కూడా కాస్త నిరాశ, నిసృహలో ఉన్నట్లు బయట వినపడుతున్న టాక్. ఇప్పటికే ఎమ్మెల్యేలు చేజారిపోతున్న వైనం. భారీ సంఖ్యలో విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు వారిని జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందే బుజ్జగించినట్లు అయినా వారు సంతృప్తి పడనట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి ముందుకెళ్లాలంటే సరికొత్త వ్యుహల్ని అమలు చేయాల్సిన అవసరముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.