ఆస్ట్రేలియాతో అమెరికా.. చైనాకు చెక్‌ పెడుతుందా?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంపు ఉన్నపుడు చైనాను నిలువరించేందుకు క్వాడ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అందులో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా ఉండేవి.  అనంతరం ట్రంపు అధ్యక్ష పదవి కోల్పోయాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత్, జపాన్ లను పక్కన పెట్టి బ్రిటన్, ఆస్ట్రేలియాను కలుపుకొని ఆకూస్ అని పేరుతో నాలుగు దేశాలను కలిపాడు.

దీని వెనకాల పెద్ద కథే ఉందని .. న్యూక్లియర్ పవర్ కలిగిన సబ్ మెరైన్స్ లను ఆస్ట్రేలియాకు ఇవ్వడం, తద్వరా చైనాకు చెక్ పెట్టేందుకే అని అమెరికా చెబుతోంది. ఆస్ట్రేలియా మాత్రం చైనాతో  మాకు ఎలాంటి విబేధాలు లేవు. చైనా తైవాన్ ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే తైవాన్ విషయంలో అమెరికా, చైనాలు ఒక వేళ యుద్ధం చేస్తే ఆ సమయంలో మేమేమి అమెరికాకు సాయం చేస్తామని చెప్పలేదని ఆస్ట్రేలియా అంటోంది. చైనాకు ముందుగానే ఒక క్లారిటీని ఇచ్చింది. కేవలం మా దేశ అణ్వస్త్ర సబ్ మెరైన్ స్థాయిని పెంచుకోవడానికి మా రక్షణ కోసం మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నామని ఆస్ట్రేలియా చెప్పింది. కానీ అమెరికా వాటిని ఆస్ట్రేలియాకు తక్షణమే అమ్మడం వెనక ఏదో మతలబు ఉందని చైనా ఊహిస్తోంది.

గతంలో ఈ సబ్ మెరైన్ లను ఫ్రాన్స్ నుంచి కొనుక్కోవాలని చూసిన ఆస్ట్రేలియా ఉన్న పళంగా అమెరికా నుంచి కొనేసుకుంది. అయితే చైనా, అమెరికా మధ్య ప్రస్తుత పరిస్థితుల్లో అసలు సరైన సత్సంబంధాలు ఉండటం లేవు. ముఖ్యంగా చైనా తైవాన్ ను తన దేశంలో అంతర్భాగమని వాదిస్తోంది. తైవాన్ కు సపోర్టుగా అమెరికా నిలుస్తోంది. దీని వల్ల ఇరు దేశాలు పరస్పరం యుద్దం చేసుకునే స్థాయి వరకు వెళతాయేమోనని ఆందోళన కలిగిస్తోంది. ఆకూస్ అనే దాన్ని ప్రవేశపెట్టిన బైడెన్ ఆస్ట్రేలియాను దగ్గర చేసుకుని చైనాకు కళ్లెం వేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: