జగన్‌ ఉత్తుత్తి బిల్లులతో.. ఆ కులాలను మోసం చేస్తున్నారా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల అసెంబ్లీలో రెండు ఉత్తుత్తి బిల్లులను ప్రతిపాదించింది. వాటిని ఉత్తిత్తి బిల్లులను ఎందుకని అంటున్నారంటే బోయ, వాల్మీకి కులాలను ఎస్సీలో చేర్చాలని రాజ్యాంగ ప్రకారం ఒక తీర్మానం ఉంది. ఒక అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే గతంలో చంద్రబాబు చేసేవాడు, కిరణ్ కుమార్ చేసేవాడు, లేదా రోశయ్య అయినా చేసేవాడు. అది కుదరదని తెలుసు. బీసీ లో జాయిన్ చేయాలంటే ప్రభుత్వానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్సీ, ఎస్టీల్లో జాయిన్ చేయాలంటే మాత్రం కొన్ని విధి విధానాలు ఉన్నాయి. దాంట్లో మార్పు చేయడానికి కుదరదు.

గతంలో చంద్రబాబు కూడా ఇదే తీర్మానం, ఆ తర్వాత జగన్ కూడా ఇదే తీర్మానం దేనికి పనిచేస్తాయి అంటే నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయవు. ఎస్సీ ఎస్టీల్లో కన్వర్ట్ అయిన క్రైస్తవులను ఎస్సీలు గానే గుర్తించాలి. వాళ్లను క్రిస్టియన్స్ గా గుర్తుంచుకూడదు, క్రిస్టియన్స్ గా వచ్చేటువంటి బీసీల్లో మార్చకూడదు ఇది రాజ్యాంగబద్ధమైన అంశం. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా వెళ్లారు గతంలో. అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది.

నువ్వు మతం ఎందుకు మారుతున్నావు, అది నీ వ్యక్తిగత స్వేచ్ఛ. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ఏ కులానికి ఏ రిజర్వేషన్ అనుభవిస్తున్నావో అదే అనుభవించు. మతం మారమని నీకు ఎవరూ చెప్పడం లేదు. నువ్వు మతం మారడం అంటేనే నువ్వు నీ కులాన్ని వదులుకున్నావని అర్థం. అలా నువ్వు వదులుకున్నప్పుడు మళ్ళీ ఆ పాత కులం నీకు ఎందుకు వర్తిస్తుంది?

అంటే దానికి ఏంటి.. ఆ కులంలో ఆర్థిక సామాజిక ప్రయోజనాలు ఆ కులంలో అవమానాలు ఎదుర్కున్నావు కాబట్టి మతం మారావు. అప్పుడు మతం మారినప్పుడు నీకు ఆ అవమానం పోయింది కదా. మరి ఎందుకు నీకు మత కుల రిజర్వేషన్. అది మతం మారకుండా ఉంటే గతంలో వివక్షకు గురైనప్పుడు వర్తిస్తుంది. అలాంటి అమలు కానీ హామీలను పాదయాత్ర సందర్భంగా జగన్ గతంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ బిల్లులు చట్టాలవుతాయా.. చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: