కైలాస దేశంపై నిత్యానంద సంచలన ప్రకటన?

కైలాస దేశం పెట్టామని నిత్యానంద ఐక్యరాజ్యసమితిలో, అరబ్ దేశాల్లో కూడా మీటింగ్ లలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో నిత్యానంద దేశాన్ని మేము పరిగణించడం లేదంటూ అమెరికా తేల్చి చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో కైలాస దేశానికి సంబంధించిన ప్రతినిధులు మేము అమెరికా లాంటి దేశాల్లో వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టామని చెప్పారు.

దీనిపై విమర్శలు రావడంతో మాకు బౌగోళిక సరిహద్దులు లేవు. మేము ప్రపంచ వ్యాప్తంగా సేవ చేస్తాం. ఎక్కడైతే మా అవసరం ఉంటుందో అది మా ప్రాంతం అంటూ ఆన్ లైన్ లో కైలాస దేశ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఈక్వెడార్ లో ని ఒక చిన్న ద్వీపాన్ని దేశంగా మార్చుకుందని వచ్చిన విషయంలో ఖండించారు.

నిత్యానంద ప్రతినిధులు ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం చర్చనీయాంశం అయింది. కైలాస దేశం అనేది ఎక్కడుందని మీడియా ప్రతినిధులు అడిగితే సరిహద్దులు లేని దేశమే కైలాసం అని కొత్త వాదన బయటపెట్టారు. కైలాస దేశం ఎక్కడుంది. ఎంత జనాభా, ఎప్పుడు స్థాపించారనే ప్రశ్నలకు నిత్యానంద ప్రతినిధులు ప్రాచీన హిందూ నాగరికతను కాపాడటం కోసం చేస్తున్న ప్రయత్నం ఇదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన స్వచ్చంద సంస్థల ద్వారా సేవలను కొనసాగిస్తున్నాం. సావరిన్ ఆర్టర్ ఆప్ మాల్టా బౌగోళికంగా లేనప్పుడు అది దేశంగా గుర్తింపు పొందింది. దీన్ని స్పూర్తిగా తీసుకునే మేం సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశంగా కొనసాగుతాం అని చెబుతున్నారు.

మాల్టా గానే కైలాసం అనేది మఠాలా ద్వారా స్వచ్ఛంద సేవలు కొనసాగిస్తుంది. ప్రత్యేక దేశం అంటూ ఏమీ లేదని చెప్పింది. ఈక్వెడార్ ప్రాంతంలో సొంతంగా ద్వీపం  కొన్నారన్న ప్రశ్నలకు నిత్యానంద అలాంటి విషయం ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019 లో ఎందుకు భారత్ విడిచి పారిపోయారనే ప్రశ్నలకు తప్పడు కేసు పెట్టారని అలాంటిది ఏమీ జరగలేదని ప్రతినిధులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: