వైసీపీ నుంచి 30 మంది లీడర్స్ టీడీపీకి జంపింగ్?
కానీ 5-10 కోట్ల వరకు డబ్బులు ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతుంది. అది వైసీపీ చేస్తుందని సేమ్ టైం బయట టాక్ కూడా ఉంది. ఎందుకంటే ఎలాగో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ రాదు. క్రిందటి సారి ఖర్చు పెట్టుకున్నది ఎంతో కొంత రికవరీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ డబ్బులకు బేరం ఆడుకున్నారనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అది నిజమో కాదో దేవుడికెరుక.
కాకపోతే ఇప్పుడు అసలు సమస్య ఏమి ఎదురవుతుందంటే ఎంతమంది వెళ్లిపోతారు అనేది. ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి టికెట్స్ ఇవ్వనంటారో, ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారో వాళ్ళలో కనీసం 50 నుండి 60 శాతం వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. గెలవడానికి అవకాశం ఈ పార్టీలో లేకపోతే మరో పార్టీలో, తెలుగుదేశం జనసేన కలుస్తాయి అంటున్నారు కాబట్టి అక్కడున్న కుల సమీకరణాలతో గెలుస్తామేమో అనుకుని తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఉంటే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇట్లాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో 30-40 మంది దాకా ఉంటారని, అందులో కొంత మంది తగ్గినా కానీ అదే రేంజ్ లో సంఖ్య అయితే ఉంటుందని తెలుస్తుంది. అయితే అంతమందికి టికెట్స్ లేకుండా చేస్తే బైటకు వెళ్లిపోడానికి సిద్ధపడతారు, ఒకవేళ ఇస్తే ఆగేటి పరిస్థితి ఉందని తెలుస్తుంది.