కర్ణాటకలో అదరగొడుతున్న కాంగ్రెస్ మేనిఫెస్టో?

కర్ణాటక ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కర్ణాటకలో ఉన్న ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా డిప్లోమా చేసినటువంటి విద్యార్థులకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. యువతకు వచ్చే ఐదేళ్లలో కర్ణాటక లో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు.

ప్రతి గృహానికి 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామన్నారు ఇంటి పెద్దగా ఉన్నటువంటి మహిళలకు నెలకు 2000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి ప్రతి నెల 10 కేజీల బియ్యం ఉచితంగా అందజేస్తామన్నారు.

కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ప్రచారంలో ఆయన యువతపై హామీల వర్షం కురిపించారు. అదే విధంగా కర్ణాటకలో బిజెపిని అన్ని ప్రతిపక్షాలు ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. బసవరాజు బొమ్మై ప్రస్తుతం ముఖ్యమంత్రి చాలా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. 40 శాతం కమిషన్లు తీసుకుంటూ అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వమే అని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

దేశం అనేది ఒకరి సొత్తు ఏమి కాదని కానీ బిజెపి విధానాల వల్ల ఆదాని లాంటి వాళ్లు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఇలాంటి విధానాలు బిజెపి మానుకుంటే మంచిదన్నారు. కానీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అంత ఈజీ కాదు. ఏదో వచ్చేసి హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓటేస్తారని  అనుకుంటున్నారు. ఇలాంటి హామీలు ఎలా నెరవేరుస్తారు అనే చర్చ సమాజంలో జరగాలి. ఎక్కడి నుంచి నిధులను తీసుకొస్తారు. ఏ విధంగా ఈ హామీలను నెరవేరుస్తారు. ప్రజలకు సంక్షేమ పథకాలను దగ్గరకు ఎలా తీసుకెళ్తారనే చర్చ జరిగి అది ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే నిజానిజాలనేది ప్రజలు గమనిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: