ఖలిస్తాన్‌ ఇష్యూ: బ్రిటన్‌కు మోదీ వార్నింగ్‌?

భారత దేశం ఇదివరకట్లాగా బ్రతిమలాడాల్సిన అవసరం ఏముంది? ప్రపంచపు రెండవ అతిపెద్ద జనాభా ఉన్న దేశం. ఏ తప్పు చేయకుండా ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నాం. భారతదేశం తప్పును సరి చేయమని అడుగుతుంది కానీ తప్పును సమర్ధించమని అడగడం లేదు.  భారతదేశం నుండి ఒక ముక్కను విడదీసి, దానిని సిక్కుదేశం గా చేసి దానికి ఖలిస్తాన్ అని పేరు పెట్టాలని, పంజాబ్ లోని ఒక ముక్కను విడదీసి దాన్ని, దీన్ని కలిపి ఖలిస్తాన్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కలిస్తాన్ ఏర్పాటు వాదుల ఉద్దేశం.

పాకిస్తాన్ లోని ఒక ముక్క కోసం పోరాటం చేయకుండా,  భారతదేశాన్ని ముక్కలు చేయడం కోసం పోరాడుతున్నారు. అలాంటి వాళ్లకు మద్దతు ఇచ్చే వాటిలో బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఉన్నాయి. అమెరికా మొన్న భారతీయ రాయబార కార్యాలయం మీద జరిగిన దాడి పై తీవ్రంగానే స్పందించింది. వెంటనే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది.

కానీ అక్కడ బ్రిటన్ కార్యాలయం మీద భారతీయ జెండాలు తీసివేయడం, అక్కడ ఖలిస్తాన్ జెండాలు ఎగరేయడం, దానిని అక్కడ ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడంతో, ఇక్కడ ఉన్న బ్రిటన్ రాయబార కార్యాలయానికి భద్రత అంతా తీసి పడేశారు. ఎప్పుడూ నిత్యం సెక్యూరిటీతో రద్దీగా ఉండే ఆ కార్యాలయం బయట అంతా ఖాళీ అయిపోయింది. దాంతో ఆ దెబ్బకి బిత్తర పోయిన బ్రిటన్ అక్కడ భారత రాయబార కార్యాలయానికి సెక్యూరిటీని పెంచింది.

మనం కోరుకుంటుంది అక్కడ సెక్యూరిటీని పెంచమని కాదు. దాడి చేసిన వాడిని శిక్షించాలని, మళ్లీ అటువంటి దాడులు జరగకుండా చూడాలని. గతంలోనే బ్రిటన్ రాయబారికి వార్నింగ్ ఇచ్చినా వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా ఉండడంతో, ఎలాంటి బాధ్యత, పద్ధతి లేకుండా ఉండడంతో  చిర్రు ఎత్తుకొచ్చిన భారత్ ఇప్పుడు భారత్ లో ఉన్న బ్రిటన్ రాయబార కార్యాలయానికి సెక్యూరిటీని తీసివేయడంతో, భారత్ కొట్టిన దెబ్బ రుచి చూసిన బ్రిటన్ ఇకనైనా జాగ్రత్తగా ఉంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: