తెలుగులో సెంచరీ కొట్టేసిన రామ్‌చరణ్ చికిరి.. ' పెద్ది ' గాడి క్రేజ్ ఈ రేంజ్‌లోనా...?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో, ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. రామ్ చరణ్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలను మరింత పెంచుతూ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ చికిరి ’ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ క్యాచీ ట్యూన్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లగా, రామ్ చరణ్ హూక్ స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వారు ఈ సాంగ్ స్టెప్స్‌ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
అంతేకాదు, ఈ పాట కేవలం తెలుగులోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అన్ని భాషల్లో కలుపుకుని ఈ సాంగ్ 150 మిలియన్‌కు పైగా వ్యూస్ అందుకుని సెన్సేషన్‌ను సృష్టించింది. రామ్ చరణ్ మాస్ లుక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 మార్చి 27న పెద్ది సినిమా ను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ ఈ యేడాది సంక్రాంతికి శంకర్ దర్శకత్వం లో నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడం.. అంతకు ముందు తన తండ్రి చిరు తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య కూడా ప్లాప్ కావడంతో ఈ సినిమా తో హిట్ కొట్టి స్టార్ హీరోల లీగ్ లో కసితో ముందుకు రావాలని చూస్తున్నాడు. మరి రామ్ చరణ్ కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.