అఖండ 2 : లాజిక్కులు... మ్యాజిక్కులపై బోయ‌పాటి క్లారిటీ... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2' సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర స్టడీగా కొనసాగుతోంది. అయితే, విమర్శకుల నుంచి సినిమాకి మిశ్రమమైన అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా, సినిమాలో లాజిక్కులు లేవు అనే ఒక కామన్ కామెంట్ ఎక్కువగా వినిపించింది. ఈ విమర్శలపై దర్శకుడు బోయపాటి శ్రీను ఒక వివరణ ఇచ్చారు. ఆయన 'అఖండ' పాత్రను ఒక సూపర్ మాన్ తరహా కథలానే చూడాలని చెప్పారు. అదే సమయంలో సినిమాలో ప్రస్తావించిన అష్టసిద్ధి సాధన గురించి చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు.


"దేశానికి పెద్ద విపత్తు రాబోతుంది. దాన్ని నివారించాలంటే అష్టసిద్ధి సాధన ఒకటే మార్గమని మురళీమోహన్ గారి క్యారెక్టర్‌తో ముందే చెప్పాం. అష్టసిద్ధి అంటే మామూలు విషయం కాదు. ఆ సాధన చేసిన వాళ్ళు ఎలాంటి శక్తులు పొందుతారో గూగుల్ చేయండి. సూపర్ హ్యూమన్‌ని లాజికల్‌గానే చూపించాం. అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్లు ఇందులో ఉంటాయి. కానీ ఎక్కడో కాస్త అతీతం లేకపోతే ఈ క్యారెక్టర్ అలా సూపర్ పవర్‌గా అవ్వదు. ఇందులో మనిషితో దిష్టి తీసి ఒక సన్నివేశం ఉంటుంది. అష్టసిద్ధి సాధన చేసి వచ్చిన వాళ్ళు తొలిసారి ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఎంత పవర్ ఉంటుందో చూపించడమే ఆ సన్నివేశ ఉద్దేశం" అని బోయపాటి వివరించారు.


ఇదే సమయంలో, సినిమా వాయిదా పడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం గురించి కూడా ఆయన స్పందించారు. "టికెట్ తీసుకొని థియేటర్ కి చేరుకున్న తర్వాత సినిమా వాయిదా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. కనీసం ఒక రెండు రోజులు ముందే చెబితే అభిమానులు అర్ధం చేసుకునేవారు. అలాంటి పరిస్థితి రావడం నిజంగా దూరదృష్టకరమే" అన్నారు. '14 రీల్స్‌ ప్లస్‌’ నిర్మాతలకు మరో సంస్థతో ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతో డిసెంబరు 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి 12న వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: