నాసా కనిపెట్టిన కొత్త గ్రహం.. ఎన్నో ఆశలు?

ఏ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఈ భూమంతా బూడిద అయిపోతే, నాలుగో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి రాళ్లతో కొట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదని ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఇది.  మరి మన బ్రతుకులు ఏమైపోతాయి అన్న ప్రశ్న వచ్చేసరికి ఆల్రెడీ వేరే గ్రహాల మీద పరిస్థితులు గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒకవైపు చంద్రుడు మరియు అంగారకుడు వీటిపై నీటి జాడలు ఉన్నట్లుగా తాజా అధ్యయనంలో తేలింది.

అమెరికా ఇంకా జర్మనీ సంయుక్తంగా ప్రయోగించిన స్ట్రాటో స్ఫియరిక్ అబ్జర్వేటరీ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ ఫర్ సోఫియా అనే వ్యోమ నౌక పంపించిన ఫోటోల ఆధారంగా చంద్రుడికి సంబంధించిన మ్యాపుని రూపొందించారు. చంద్రుడిలో మనకు కనిపించే నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని ఈ మ్యాప్ కవర్ చేస్తుంది. చంద్రుడి మీద 60 డిగ్రీల అక్షాంశాల దిగువ బాగాన ఉన్న ప్రాంతమంతా ఈ మ్యాప్ లో ఉంది. చంద్రుడు మీద నీటి ప్రవాహం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలా కదులుతుంది అనేది కూడా ఈ మ్యాప్ లో తెలుసుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు.

అంతేకాకుండా దక్షిణ దృవంలోని భౌగోళిక పరిస్థితులు కూడా దీని ద్వారా క్షుణ్ణంగా పరిశీలించవచ్చని చెప్తున్నారు. చంద్రుడు ఉపరితలం మీద చాలా చోట్ల సూర్యకాంతి పడక అతి శీతల వాతావరణం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చందమామ ఉపరితల లక్షణాలలో అక్కడ నీటికి ఎలాంటి సంబంధం ఉన్నదనేది మ్యాప్ ద్వారా సులభంగా తేల్చవచ్చని నాసా చెబుతుంది. ఇంకో పక్కన అంగారక గ్రహం మీద వాతావరణం శూన్యమని , గాలినీరు ఉండదని మానవ మనుగడ  అక్కడ అసాధ్యమని సైంటిస్టులు ఇన్నాళ్ళూ భావించారు.

అక్కడ నీటి ఉనికి ఉందని, మార్స్ మధ్య రేఖ పైన పురాతన హిమానీ నదం గ్లేషియర్ అవశేషాలు ఉన్నాయని గుర్తించామని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. వేల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలడం వలన ఇక్కడున్న నీరంతా ఉప్పు కూపంలో ఘనీభవించినట్లుగా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: