టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నిక విజయం.. లోకేశే కారణమా?

మొన్నటి వరకు పెద్దగా మాట్లాడటం చేతకాదు లోకేష్ కి అన్న వాళ్ళు కూడా ఈవేళ ఆయన ప్రసంగాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు పాదయాత్రలో ఆయన రోజుకి రెండు, మూడు చోట్ల ప్రసంగాలు ఇస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు గతంలో ఆయనను ఐరన్ లెగ్ లేదా పప్పు అని విమర్శించిన జనాలందరూ కూడా ఆ విమర్శలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందేమో ప్రస్తుత లోకేష్ రాజకీయ పరిణితిని చూసి.

పాదయాత్రలో జగన్ మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఉపన్యాసం చేస్తే, లోకేష్ మాత్రం ఒకే రోజు మూడు, నాలుగు చోట్ల ఉపన్యాసం ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రసంగాల్లో తప్పు ఒప్పలను పక్కన పెడితే, పేపర్ లేకపోతే జగన్ కి కూడా తెంగ్లీష్ అనేది కామన్ కాబట్టి ఈ ఒక్క పాయింట్ లో ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదు.

లోకేష్ పాదయాత్ర మొదట్లో మైనస్ అనే స్థాయి నుండి ఇప్పుడు ప్లస్ అని స్థాయికి మారుతూ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే  ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ఉండగానే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం విజయం సాధించడం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఫస్ట్ ప్రియార్టీ ఓట్లలో గట్టి పోటీ అనేది, పిడిఎఫ్ తో తెలుగుదేశం పొత్తు పెట్టుకుని ఉండొచ్చు.

కానీ తెలుగుదేశానికి రాయలసీమలో అసలు సీను లేదన్న స్టేజ్ లో కిందటిసారి 52 గాను రెండు మూడు స్థానాలతోనే పరిమితమయింది. అవి కూడా కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, అనంతపురంలో పయ్యావుల కేశవ నాయుడు ఇలా రాయలసీమలో ఈ ముగ్గురికే పరిమితమైన దశలో రేపు రాయలసీమలో భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన వచ్చిన నేపథ్యంలో.. వచ్చిన అతి పెద్ద మార్పు ఎమ్మెల్సీ విజయం. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం సాధించిన విజయం కావడం, అది కూడా ప్రత్యేకించి లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు  ఇలా రావడం ఇప్పుడు గొప్ప పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: