పవన్‌కు బడ్జెట్‌తో సమాధానం చెప్పిన జగన్‌?

జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కు గానీ, చంద్రబాబు కు గానీ సమాధానంలా కార్పొరేషన్ కి కీలకమైనటువంటి బడ్జెట్ ఇచ్చారు. టోటల్ గా 2,79,279లక్షల వార్షిక బడ్జెట్ లో పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు-685కోట్లు, విద్యుత్ శాఖకు-6,457కోట్లు, గ్రామ వార్డు సచివాలయ శాఖకి-3,858కోట్లు, గడపగడపకి మన ప్రభుత్వానికి-532కోట్లు, మనబడి నాడు నేడు పథకానికి- 3500కోట్లు, పేదలందరికీ ఇళ్లు పథకానికి-5600కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యానికి-2,602కోట్లు, రోడ్లు భవనాల నిర్మాణ శాఖకు-9,119కోట్లు కేటాయించారు.

అలాగే నీటి వనరుల అభివృద్ధి శాఖకు-11,809 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి-3వేల కోట్లు, వ్యవసాయ స్థిరీకరణకు-1,212కోట్లు, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి- 1582కోట్లు, కాపు సంక్షేమ నిధికి-4,887కోట్లు, మైనార్టీ సంక్షేమ నిధికి 4,203 కోట్లు, అమ్మ ఒడికి 6,500కోట్లు ఇలా మొత్తం డిబిటి స్కీము 54,228 కోట్లు కేటాయించారు జగన్.

అదే సందర్భంలో జగన్ విద్యా కానుక-560కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ 15,853కోట్లు, పురపాలక పట్టణ అభివృద్ధి 9,381కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కి 11666 కోట్లు, వైఎస్ఆర్ ఆసరాకు 6,700కోట్లు, షెడ్యూల్డ్ తెగ కాంపోనెంటుకు 6,929కోట్లు, వెనుకబడిన తరగతులకి 38605కోట్లు, వైయస్సార్ చేయూతకు 5000కోట్లు, నా నేస్తం 17 కోట్లు, యువజన అభివృద్ధి పర్యాటకం సంస్కృతిక శాఖకు 1291కోట్లు, షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్ కోసం 20,005 కోట్లు, వైయస్సార్ కళ్యాణమస్తుకు 200కోట్లు ఇచ్చారు.

ఇంకొకవైపు మైనార్టీ సంక్షేమానికి కార్పొరేషన్లు పరంగా చూస్తే ప్రధానమైంది కాపు కార్పొరేషన్ ఒకటి, రెండవది మైనార్టీ కార్పొరేషన్ కి, అట్లాగే బ్రాహ్మణుల కార్పొరేషన్ కి నిధులు ఇవ్వడం అంటే ఆ నిధుల ద్వారా ఆ ఏడాదికి అంటే ఈ 3,4ఏళ్ల నుండి 45నెలల్లో వాళ్లకు పదవులు వచ్చాయి. కానీ వాళ్ళ వాళ్ళకి ఏమి చేసుకోలేకపోయారు. ఈ బడ్జెట్ ద్వారా ఈ ఏడాదైనా వాళ్ళు అప్పులు తీసుకోవడానికో, పెట్టుబడులు పెట్టుకోవడానికో వేటికైనా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: