
ఎక్కువ జీతం వద్దు.. ప్రశాంతత ఉంటే చాలు?
తాజాగా ఎక్కువ జీతం తీసుకుంటూ మానసిక అశాంతితో బ్రతకడం కన్నా, జీతం తక్కువ వచ్చినా సరే ప్రశాంతంగా బ్రతకడం ముఖ్యం అనుకుంటున్నారు భారతీయ ఉద్యోగులు. అది కూడా మెట్రో సిటీకి సంబంధించిన ఉద్యోగులు. ఈ ఉద్యోగులలో ఇది బాగా పెరిగింది. ఇది ఈ మధ్యన తేలుతున్నటువంటి అంశం. ఈ మధ్యన వర్క్ ప్లేస్ టెన్షన్స్ కి సంబంధించి చేసిన సర్వేలో లాంగ్ అవర్స్ డ్యూటీ తో సఫర్ అవుతున్న వాళ్లలో ఈ మార్పు వస్తుంది.
33 శాతం మంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటే, 34 శాతం మందిలో కాన్సన్ట్రేషన్ పోతుంది. 31 శాతం మంది ఒత్తిడితో స్నేహాలను పోగొట్టుకుంటున్నాం, ఇంట్లో బంధాలను చెడగొట్టుకుంటున్నాము, తోటి సిబ్బందితో కూడా ఈ ఒత్తిడితో సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. 21 శాతం సమస్యలు పెరిగాయని చెప్తున్నారు. మేనేజర్లలో 49 శాతం మందిలో వ్యతిరేకత ఉంది. 39 శాతం మందిలో నెలకి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేకపోతున్నామని చెప్తున్నారు.
డబ్బు కన్న ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచన 46 శాతం మందిలో పెరిగింది. ఫ్రెండ్స్ తో గడపాలనుకునే వారి శాతం పెరిగింది. ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ఇదివరకు జీతం బాగా వస్తే సమాజంలో పేరు, ప్రతిష్ట అనుకునే రోజులు ఇప్పుడు కనపడటం లేదు. ఆదాయం సంపాదించడం కన్నా, ఆరోగ్యాన్ని సంపాదించడమే ముఖ్యమనే భావన చాలామంది ఉద్యోగులలో కనిపిస్తుంది.