పుతిన్ తీవ్ర నిర్ణయం.. మరో రెండేళ్లు యుద్ధం?
రష్యాకు ఇంకా రెండు సంవత్సరాల పాటు యుద్ధం చేయగల ఆయుధాలు, మిస్సైల్స్ ఉన్నాయని పేర్కొంది. ఆ తర్వాత కూడా యుద్ధం చేయాలంటే చైనా, నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల మీద ఆధారపడవచ్చని లిథువేనియా తెలిపింది. నిజమే ఇంకా రెండు సంవత్సరాలు యుద్ధం అంటే మామూలు మాటలు కావు. ఇంకా రెండేళ్ల పాటు రష్యా యుద్దం చేస్తే ఉక్రెయిన్ కు మిగిలేది బూడిద మాత్రమే. ఇంకా ఏం ఉండదు. ఇప్పటికే చాలా నగరాలను ఉక్రెయిన్ కోల్పోయింది. చాలా ప్రాంతాల్లో యుద్ధ బీభత్స సన్నివేశాలు కనిపిస్తూనే ఉన్నాయి.
యుద్ధం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్న ఆస్తులు, అంతస్తులు అన్ని ధ్వంసం అవుతూనే ఉన్నాయి. అయినా ఉక్రెయిన్ అమెరికాను నమ్ముకుని యుద్ధం చేయాలనుకోవడం ఎంతటి పొరపాటో ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతుంది. అమెరికా అడుగు పెట్టిన ప్రాంతాలు గతంలో ఇరాక్, ఆప్గానిస్తాన్, లిబియా లాంటి దేశాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మరి ఉక్రెయిన్ ఇంకా రష్యా తో యుద్ధం చేస్తానంటే పుతిన్ రాబోయే రోజుల్లో తీసుకునే కఠిన నిర్ణయాలకు జెలెన్ స్కీ సిద్ధపడాలి.
ఏ మాత్రం తోక జాడించాలని చూసిన పుతిన్ ఉగ్రరూపం దాల్చితే అణు యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. అణు బాంబులు గనక ఉక్రెయిన్ లో పడితే ఇక ఆ ప్రాంతమంతా కొన్ని వందల సంవత్సరాల దాకా పనికిరాకుండా పోతుంది.