ఆ దేశంలో భారీగా బయటపడ్డ నయా బంగారం నిల్వలు?

భారతదేశంలో ఒక చోట బంగారం గనులు, ఒకచోట రేర్ ఎర్త్, కాశ్మీర్ లో లిథియం ఇలా కనపడినప్పుడు మనం చాలా గర్వపడ్డాం. ఇప్పుడు సహజ వనరుల వెలికితీత అన్ని దేశాలు చేస్తున్నాయి. అందులోనూ ఇరాన్ చేస్తే లిథోయం నిల్వలు మనకన్నా ఎక్కువ నిల్వలు బయటపడ్డాయి. వైట్ గోల్డ్ అని పిలవబడే ఈ లిథియం, బ్యాటరీల దగ్గర నుంచి మనకు చాలా వాటిలో ఇది పనికి వచ్చే పదార్థం. ఇప్పుడు చూస్తే 9.2 మిలియన్ టన్నుల లిథియం ఇరాన్ లో దొరికినట్టుగా తెలుస్తుంది. ఇది టెన్త్ వరల్డ్ హైయెస్ట్ గా నమోదయింది.

భారత దేశంలో 5.9 మిలియన్ టన్నులు లిథియం దొరికితే వాళ్ల దగ్గర మాత్రం 9.2 మిలియన్ టన్నుల లిథియం నిలువలు బయటపడ్డాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్  పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ని కొనేవాడు లేకపోయే రోజులు త్వరలోనే రానున్నాయని నిపుణులు అంటున్నారు. వాటి మీద బ్రతుకుతున్న ఇరాన్ కి ఇది పెద్ద లాభం అని చెప్పాలి. అదే సమయంలో 50% ఇన్ఫ్లేషన్తో ఇబ్బంది పడుతున్న ఇరాన్ కి గొప్ప అవకాశం ఇది. ఇప్పటికే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఈ ఆంక్షల వల్ల థర్టీ పర్సెంట్ దెబ్బతిని ఉంది.

ఇలాంటి దశలో లిథియం నిల్వలను కలిగి ఉండడం వల్ల చైనా ఇరాన్ తో స్నేహం చేయడానికి రెడీ అయిపోయింది. దానితో పాటు అమెరికా కూడా స్నేహం చేయడానికి రెడీ అయిపోతుంది. కాబట్టి లిథియం నిల్వల విషయంలో సరికొత్తది అయినటువంటి ఇరాన్ లో దొరకటం వాళ్లకు సంతోషం కలిగించే పరిణామం అనే చెప్పాలి. హమదాన్ ప్రాంతంలో ఈ లిథియం నిల్వలు దొరికాయి. వాస్తవంగా ఇప్పటిదాకా చిలీకి ప్రపంచంలోనే హైయెస్ట్ నిల్వలు దాదాపు 9.2 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఇరాన్ కూడా దాదాపు అంతే అని చెప్తున్నారు, కానీ అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 8.5 బిలియన్ టన్నులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: