జీ20: దిల్లీలో దడ పుట్టిస్తున్న విదేశీయులు?

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది భారత పరిస్థితి. అడ కత్తెరలో పోక చెక్కలా ఉంది దాని స్ధితి. భారతదేశం ఇప్పుడు జీ ట్వంటీ దేశాలకు ఆతిధ్యం ఇస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం అయితే నిరసనలను అంగీకరించాలి. కానీ నిరసనలు అనేవి తమ ఎదుట జరిగితే అంగీకరించవు ఇవే ప్రజాస్వామ్య దేశాలు. ఆందోళన, ఆగ్రహం, లేదా ఆవేదన వ్యక్తం చేస్తాయి, మన పట్ల చిన్నచూపు చూస్తాయి. కాబట్టి వాటిని ఆపాలి. ఆపితే ఇవే దేశంలో ఉన్న మానవ హక్కు సంఘాలు వచ్చి పౌర హక్కులకు భంగం వాటిల్లిందని, మానవ హక్కులకు భంగం వాటిల్లిందని మాట్లాడుతూ ప్రపంచమంతా చాటి చెబుతాయి.

ఉదాహరణకి చైనాకి వ్యతిరేకం తైవాన్. మొన్న చైనాకు సంబంధించిన విదేశాంగ మంత్రి వచ్చినప్పటి నేపథ్యంలో వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి తైవాన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళని అడ్డుకోవాల్సి వచ్చింది భారతదేశపు పోలీస్ యంత్రాంగం. టిబేట్ వాళ్లు కూడా వాళ్లకు వ్యతిరేకంగా వచ్చారు వాళ్ళను కూడా ఆపాల్సి వచ్చింది. భారతదేశం రాబోయే రోజుల్లో ఈ జీ ట్వంటీ కి సంబంధించిన పర్యావరణ అంశాల మీద, మానవ హక్కుల అంశాల మీద, ఇంకా వివిధ అంశాల మీద ఉద్యమాలు చేయడానికి పలువురు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా కూర్చోబోతుంది. ఇక్కడ ఎలా సెట్ చేయాలి అనే దానిమీద ద్విముఖ వ్యూహం పన్నుతూ ఆందోళన కారుని ఆ దరిదాపులకి కూడా రానివ్వకుండా, అదే సందర్భంలో నిరసనల్ని వేరేచోట తెలియజేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ నెల 6, 7 తేదీల్లో జీ 20 సమావేశాలు హైదరాబాద్‌ వేదికగా ఘనంగా జరగనున్నాయి. గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌ (జీపీఎఫ్‌ఐ) పేరుతో ఈ జీ 20 సదస్సు జరగనున్నది. ఈ సమావేశాలకు జీ 20 దేశాల ప్రతినిధులతో పాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

G20

సంబంధిత వార్తలు: