భారత్ వెంటపడుతున్న రష్యా, అమెరికా?

ఒకప్పుడు భారత్ వద్ద సరైన ఆయుధాలు ఉండేవి కావు. కొనుక్కుందామని అమెరికా, రష్యాలను అడిగితే వారి నుంచి సరైన స్పందన ఉండేది కాదు. డబ్బులిచ్చి బతిమిలాడి వారి నుంచి ఆయుధాలను కొని తెచ్చుకునే వాళ్లం. అమెరికా అయితే డబ్బులు ఇచ్చినా ఇప్పుడు కాదు కొన్ని రోజులు ఆగండి.. మళ్లీ ఇస్తాం అనే వారు. ప్రస్తుతం సీను రివర్స్ అయింది. అమెరికా, రష్యాలు ప్రస్తుతం భారత్ ను ఆయుధాలు కొనుక్కోమని పోటీ పడి మరీ అడుగుతున్నాయి.


ఒకప్పుడు రష్యా ఆయుధాలు ఇచ్చింది కానీ అవి రెండో గ్రేడు రకానికి చెందినవి. ప్రస్తుతం అమెరికా భారత్ కు ఒక ఆఫర్ ఇచ్చింది. మా వద్ద ఎఫ్ 35 అనే ఎయిర్ క్రాప్ట్ లు ఉన్నాయి. వాటిని మీకు ఇస్తాం కొనుక్కోండి అని అడుగుతున్నారు. లేదు మా వద్ద కూడా ఉన్నాయి. మేం ఇస్తామని రష్యా పోటీకి వస్తోంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నాయి.


అమెరికా ముఖ్యంగా ముందుండి ఈ యుద్ధాన్ని చేయిస్తోంది. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ వారికి అండగా ఉంటోంది. ఇదే విషయంలో అమెరికా, భారత్ ను దగ్గర చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుత సమయంలో భారత్ ను దూరం చేసుకుంటే తమకు ఏమీ లాభం లేదని అగ్రరాజ్యం అనుకుంటోంది. దీంతో ఐఏఎఫ్ కు కావాల్సిన 120 యుద్ధ విమానాలను అందించేందుకు అమెరికా ముందుకు వస్తోంది. కాదు మేము కూడా ఇస్తామని రష్యా అంటోంది.


ఐఏఎఫ్ ( ఇండియాన్ ఎయిర్ ఫోర్స్) కు కావాల్సిన ఎలాంటి యుద్ధ సామగ్రినైనా అందివ్వడానికి అమెరికా సిద్ధంగా ఉంది. మీరు మా వద్ద కొనుక్కోవాలని కోరుతోంది. ఒకప్పుడు అవే యుద్ధ సామగ్రి ఇవ్వండి బాబోయ్ అన్న ఇవ్వని దేశాలు మేమే ఇస్తాం కొనుక్కోండని భారత్ వెంట పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: