అన్న జగన్‌కు చిక్కులు తెస్తున్న వైఎస్ షర్మిళ?
షర్మిళ తెలంగాణలో పాదయాత్ర చేస్తుంటే భారాస పార్టీ వారు మాటల దాడి పెంచేస్తున్నారు. షర్మిళ భారాస నాయకులను నిలదీస్తోంది. దీంతో షర్మిళపై ఆ నాయకులు మండి పడుతున్నారు. జగన్ తో భారాస పార్టీకి సంబంధించిన నాయకులకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ షర్మిళ అంటేనే వీరికి పడటం లేదు.
తెలుగుదేశం నుంచి భారాసలోకి వచ్చిన తెలంగాణలోని సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి షర్మిళ కు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే విజయమ్మ, జగన్, షర్మిళ అందరూ కూడా సమైక్యాంధ్ర కోసం తెలంగాణలో జెండాలు పట్టుకుని తిరిగిన వారు మీకు ఇక్కడేం పని అని అన్నారు. ఆంధ్రాకి వెళ్లి రాజకీయాలు చేసుకో అని షర్మిళ ను అన్నారు. మీ అన్న జగన్ ఎలాగో జైలుకు వెళతాడు. తర్వాత అక్కడ ఆయన పార్టీని చూసుకోవాల్సింది మీరే కదా అక్కడ ఉంటే మీకే బాగుంటుందన్నారు.
ఈ వ్యాఖ్యలు జగన్ ని విమర్శించనట్లా, వైఎస్ షర్మిళను విమర్శించినట్లా? ఏదైతేనేమేం ఆంధ్రలో పాదయాత్ర చేసినపుడు, జగన్ జైలుకెళ్లినపుడు షర్మిళ వైఎస్సార్ పార్టీని ముందుండి నడిపించింది. కానీ అధికారంలోకి రాగానే సొంత అన్న పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో సొంత రాజకీయ పార్టీని పెట్టుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది పొరపాటు చేసినట్లే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ వాదం ముందు సమైక్యాంద్ర కోసం పోరాటం చేసిన షర్మిళను తెలంగాణలో ప్రజలు ఆదరించేందుకు అంత సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకుల భావన.