అమెరికాకు దడ పుట్టిస్తున్న కిమ్‌.. అణుబాంబు వేస్తాడా?

frame అమెరికాకు దడ పుట్టిస్తున్న కిమ్‌.. అణుబాంబు వేస్తాడా?

అమెరికా ఉత్తర కొరియా మధ్య  యుద్ధ వాతావరణం నెలకొంది. కిమ్ అమెరికాను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాలోని సీయోల్ లో అమెరికా మరియు దక్షిణ కొరియా చేస్తున్నటువంటి సైనిక విన్యాసాలను తక్షణమే ఆపివేయాలని లేకపోతే అమెరికాపై అణు దాడి చేస్తామని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరించారు.  అయితే ఇది ఆషామాషీ విషయం కాదు. అణు బాంబు దాడి చేస్తామంటే అమెరికా చూస్తూ ఊరుకోదు.

అమెరికా దక్షిణ కొరియా గతంలోనూ ఇలానే సైనిక విన్యాసాలు జంటగా చేసినప్పుడు కిమ్ రెచ్చిపోయాడు. అప్పుడు కూడా తమ వద్ద ఉన్న అన్వస్త్రాలను అమెరికాపై ప్రయోగిస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం కిమ్ హెచ్చరికలు జారీ చేశాడు. తన దేశానికి ఎటువంటి ఇబ్బంది కలిగిన ఊరుకునే  ప్రసక్తే లేదని అన్నాడు. ఈ అణు బాంబులు అనేటివి పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యాయి. నార్త్ కొరియా పాకిస్తాన్ లాంటి దేశాల వద్ద అణు బాంబులు ఉండడం అనేది ప్రపంచం ముందున్న ఒక పెద్ద సమస్య. వీరి మనస్తత్వాలు, విధానం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియదు.

ఏ చిన్న విషయానికైనా వాటిని ఉపయోగిస్తామని అంటూ ఉంటారు. ఇతర దేశాలపై దాడిని చేసేందుకు ఏ మాత్రం వెనకాడరు.  ఇది సరైన విషయం కానప్పటికీ ఆయా దేశాల ప్రవర్తన అలాగే ఉంటుంది. మరి కిమ్ చేసిన హెచ్చరికకు అమెరికా ఎలా స్పందిస్తుంది. గతంలోనూ ట్రంప్ హయాంలో యుద్ధం వరకు వచ్చినటువంటి విషయాన్ని దౌత్యపరమైన చర్చల వల్ల పరిష్కరించుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు కలిసి సమస్యను మాట్లాడి యుద్ధం జరగకుండా ఆపారు. ఇపుడున్న పరిస్థితులు వేరు,  రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అమెరికా నార్త్ కొరియా పై ఎటాక్ చేస్తే, రష్యా కిమ్ కి సహకరిస్తే ఇంకేమైనా ఉంటుందా.. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే పరిస్థితి తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KIM

సంబంధిత వార్తలు: