తెలంగాణ: కేసీఆర్‌ వర్సెస్‌ తమిళిసై.. వార్‌ పీక్స్‌?

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అనేది రాబోయే రోజుల్లో తీవ్ర తరం కానుంది. రాజ్యాంగ బద్ధంగా ఉన్నపదవి గవర్నర్ ది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి. కానీ సీఎం కేసీఆర్ ఏకంగా గవర్నర్ ప్రసంగం లేకుండా శాసనసభ సమావేశాలు కొనసాగించాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది సాధ్యపడితే రాజ్యాంగ బద్ధంగా వచ్చిన గవర్నర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అవమానించినట్లే అవుతుంది.

ముఖ్యంగా రాష్ట్రంలో మహిళా గవర్నర్ ఉన్నారు. గతంలోనే ఒకసారి బడ్జెట్ సమావేశాల్లో ఆమెకు పిలుపు అందలేదు. దీంతో అప్పుడే తీవ్ర చర్చనీయాంశం అయింది. మరోసారి ఈ సమావేశాల్లో ఆమెకు ఆహ్వానం అందుతుందా లేదా. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెడతారా? ఒకవేళ ప్రవేశపెట్టినా తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.

గవర్నర్ కోర్టుకెళ్లే అవకాశం ఉందా. న్యాయస్థానాలకు వెళితే ఇప్పటివరకు ఉన్న అధికారం కాస్త న్యాయవ్యవస్థ వద్ద పెట్టినట్లవుతుంది. పోనీ బడ్జెట్ ప్రవేశపెట్టినా గవర్నర్ సంతకం లేనిదే ఆ జీవోలు చెల్లు బాటు కావు. నిధులు ఎక్కడి కక్కడ ఆగిపోతాయి. మరి సీఎం కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని అనుకుంటున్నారా? దీన్ వల్ల భాజపాకు, భారాసకు ఎలాంటి లాభం చేకూరే అవకాశం ఉంది. రాజకీయంగా వాడుకుంటే ఏ పార్టీ ప్రజల్లో లబ్ధి పొందుతుంది.

తమిళనాడు గవర్నర్ లాగా పరువునష్టం దావా వేస్తే, పోనీ బడ్జెట్ పత్రాలపై సంతకం చేయకపోతే అప్పుడు ఏ రకంగా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. గవర్నర్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో. భాజపా ఇదే సాకుగా చూపి మహిళా గవర్నర్ అనే మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్న సీఎం కేసీఆర్, భారాస అంటూ ప్రచారం చేయాలనుకుంటే అప్పుడు భారాస చెప్పే సమాధానం ఏ విధంగా ఉండనుంది. మొత్తం మీద రాబోయే బడ్జెట్ సమావేశాల ప్రారంభమే వివాదంగా మారుతుందా ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: