పులివెందులతో.. జగన్‌పై హైపర్ ఆది పోటీ చేస్తారా?

రెండు రోజులుగా తెగ వైరల్ అవుతుంది ఆది స్పీచ్. పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమావేశంలో ఆది ఆవేశంగా మాట్లాడారు. పులివెందులలో జగన్ పై ఆది పోటీ చేస్తారనే తీవ్ర చర్చ మొదలైంది అసలు ఒక జబర్దస్త్ కమెడియన్ రాష్ట్ర సీఎంపై పోటీ చేయడం కామెడీ చేసినంత ఈజీ కాదని చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పై ఆలీ పోటీ చేస్తే జగన్ పై ఆది పోటీ చేస్తాననడటంతో చర్చ తీవ్రతరం అయింది.

ఏదేమైనా రాజకీయాలు వేరు సినిమా రంగం వేరు, సినిమా రంగంలో ఉన్న ఇద్దరు ప్రముఖులు వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ వారు ఆ నాయకుల కనుసన్నల్లోనే రాజకీయాల్లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఆది పులివెందుల నుంచి పోటీ చేస్తే గతంలోనే సతీష్ రెడ్డి, బీటెక్ రవి లాంటి వారు కూడా జగన్ ను ఓడించడానికి తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ ఇప్పటికీ వారికే విజయం సాధించడం కాలేదు. కొన్ని పంచులు రాసుకొని వచ్చి ప్రచారం చేసిన అక్కడ చప్పట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. ఓట్లు వేసేది ఎవరు? ఆదిని గెలిపించేది ఎవరు? అదంతా సులువు కాదు. రాజకీయాల్లో ప్రాసలు సభలో మాట్లాడడం వారి చేత చప్పట్లు కొట్టించుకోవడం వరకు మాత్రమే పనికొస్తాయి.

కానీ అసలు సిసలు ఓటుని ఎలా సాధించాలి ఓటర్ నుంచి ఆ ఓటుని మనం పార్టీకి ఎలా వేయించుకోవాలి అనేది అంతా ఈజీ కాదు. అది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం మీద వైసిపి జనసేన పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే  పరిస్థితి నెలకొంది. మొన్న నిర్వహించిన సభలో ఆది మంత్రులపై కూడా తీవ్రంగానే విమర్శలు చేశాడు. ఆది, అలీల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మరి రాబోయే సాధారణ ఎన్నికల్లో తేలిపోనుందా? పవన్ కళ్యాణ్ ఆదికి నిజంగానే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అలీ పవన్ పై పోటీ చేస్తారా. పోటీ చేస్తే పవన్ కే లాభం అంటున్నాయి ఆయా సామాజిక సమీకరణాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: