జగన్‌కు 175 స్థానాలు రావాలంటే.. ఇలా చేయొచ్చు?

పూర్తి స్థాయిలో విజయం సాధించడం అనేది.. దేశంలో ఎక్కడా ఏ పార్టీ వల్ల అయ్యే పని కాదు.అదే నిజం అని తెలిసినా కూడా  వై.ఎస్.ఆర్.సీపీ వై నాట్ 175 అనే మంత్రంతో, పొలిటికల్ తంత్రంతో.. ముందుకు వెళ్తుంది. అదొక మైండ్ గేమ్. ఆ పార్టీ మాకు ప్రత్యేకించి ఇన్ని సీట్స్  వస్తాయని చెపితే..మిగిలిన సీట్స్ ఎందుకు రావు అనే ప్రశ్న వస్తుందని వారు ఇవన్నీ ఎందుకు అన్న పద్దతి లో ఈ గళాన్ని ఎత్తుకున్నారు అనిపిస్తుంది. గత ఎన్నికల్లో 150 సీట్స్ గెలిచాం కదా అని.. ఇప్పుడు కూడా అన్నే గెలుస్తాం అని అనుకోవడానికి లేదు. ఆ లెక్కలో ఎక్కువ తక్కువ రావడం అనేది అధికార పక్షం లో ఉన్న నాయకుడు.. పరిపాలనా కాలంలో.. ప్రజలకు చేసేటటువంటి మంచి, చెడుల పైన ఆధారపడి ఉంటుంది.


175స్థానాలకు 175స్థానాలు గెలిచే అవకాశం కూడా ఉంది. అది కూడా విభజన హామీలు అమలు చేసే విషయం లో కేంద్రం పై వత్తిడి తెచ్చి విజయం సాధించినప్పుడు మాత్రమే. కానీ అడిగేవారు విభజన హామీల్లో కేంద్రం ఇవ్వవలసిన డబ్బులు గురించి అడుగుతున్నారు కానీ  హక్కులను మాత్రం అడగడం లేదు. విభజన చట్టంలో ఒక పార్ట్  ఆంధ్ర - తెలంగాణాల నియోజకవర్గాల విభజన. అది చేయడం లేదు. పాత జనాభా లెక్కల ప్రకారం అస్సాంకి,కాశ్మీర్‌కు చేస్తున్నారు గాని మనకు చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ చేస్తే భారతీయ జనతా పార్టీ కి..రాజకీయ లాభం ఉండదు కాబట్టి.


అలాగే అటు  ఒత్తిడి తేవాల్సిన  ఆంధ్రాలో అధికార పక్షమైన వైఎస్సార్సీపీ గానీ, ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ గానీ నోరు మెదపడం లేదు. తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఒత్తిడి తేవడం లేదు. అలా చేస్తే ఆంధ్రకి 175 నుంచి 225 స్థానాలు పెరుగుతాయి.  ఎమ్మెల్యే  ఎమ్మెల్సీ సీట్లు కూడా పెరుగుతాయి. కానీ ఇప్పటికిప్పుడు సీట్లు  పెరిగితే జరిగేది నష్టమే కాబట్టి ఎవరూ ముందుకు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: