భారత్ సాధించిన ఈ విజయాలు చూశారా?
ఎరువులు, విత్తనాలును అందించడం, పంటల మీద ఇన్సూరెన్స్ చేయించడం, అధిక దిగుబడుల కోసం జీ.ఎస్.ఐ తో సర్వే చేయించడం, రవాణా సౌకర్యాలు కల్పించడం, కనీస మద్దతు ధర పలికేలా చూసి రైతులకు లాభాలు వచ్చేలా చూడడం, హెల్త్ కార్డ్ ఇంకా వడ్డీ లేని రుణాలు అందించడం వంటి పనులు కూడా చేస్తోంది. అంతే కాదు.. 23కోట్ల మంది రైతుల కోసం ఒక్కొక్కరికీ 6 వేల రూపాయల అమౌంట్ ని వారి ఖాతాలో జమ చేయడం చేస్తోంది.
ఇక దేశంలో 2015-16 లో 32బిలియన్లు ఉన్న ఎగుమతులు 21-22 నాటికి 53.1 శాతం ఆధిక్యంతో 50.24 బిలియన్ల కి పెరిగాయి. ఇలా దేశానికి వెన్నెముకైన రైతు కోసం కేంద్రం ఎన్నో చేస్తుంది. ఇక సైనికులు కోసం అత్యాధునిక ఆయుధాలతో రక్షణ కల్పించడం, రిటైర్మెంట్ తర్వాత సీ.ఆర్.ఓ.పీ. ఒకే ర్యాంకు- ఒకే పెన్షన్ పద్దతి తెచ్చారు. జూలై 2019 నుండి 25 లక్షల సైనికుల కుటుంబాలకి 23,638 కోట్లు బకాయిలతో సహా చెల్లించారు. 67 ఏళ్లలో 400 కంపెనీలు గొప్ప అనుకునే ఇండియాకు వ్యాపార పరంగా 8 ఏళ్లలో 84 వేల కొత్త కంపెనీలను చూపించింది.
67 ఏళ్లలో నాలుగు యూనికార్న్‌లు ఉంటే ప్రస్తుతం ఒక బిలియన్ విలువ కలిగి ఉన్న 105 యూనికాన్ల వరకు ఇప్పుడు ఇండియాలో ఉండడం విశేషం. కేంద్ర ప్రభుత్వాన్ని సరిగా గుర్తించడం లేదు కానీ అది అన్ని రంగాల వారికీ ఉపయోగపడే పనులనే చేస్తుంది.