చరిత్రలో అలా చేసిన సీఎం జగన్ ఒక్కడే?

పేదల కోసం పని చేసిన ప్రభుత్వాలను ప్రజలు గెలిపించుకుంటారు. నేతలు కూడా పేదల కోసం పని చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. అయితే అందరు నేతలూ ప్రజల మనసులు గెలుచుకోలేరు. ప్రజల కోసం పని చేయలేరు. కానీ.. ఏపీ సీఎం జగన్ మాత్రం చరిత్రలో ఎవరకూ చేయని పని చేశారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయుటం జరిగిందని తమ్మినేని సీతారాం అన్నారు.

రాష్ట్రంలో మొదటి   విడతలో అందని లబ్ధిదారులకు 90 రోజులు గడువు ఇచ్చి గ్రామ సచివాలయంలో నమోదు చేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలియజేశారు. మునిపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.  అందులో మొదటి దశగా 21 లక్షల ఇల్లు నిర్మిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలియజేశారు. చరిత్రలో లఇలా లక్షల సంఖ్యలో ఒకేసారి ఇళ్లు  ఇచ్చిన సీఎం జగన్ మాత్రమేనని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.  ప్రతి గడపకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని.. 90 రోజులు గడువులో ఇళ్లపట్టాల కోసం నమోదు చేసుకున్న లబ్ధిదారులకు ఈ మధ్య కాలంలో 127 ఇల్లు పట్టాలని అందజేశామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలియజేశారు.

ఆమదాలవలస మున్సిపాలిటీ  15నవవార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి పర్యటించిన స్పీకర్ తమ్మినేని సీతారామ్.. పని చేసే ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. స్పీకర్ గా రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నా.. వాస్తవాలు చెప్పేందుకు తాను ఎప్పుడూ వెనుకడుగు వేయబోనని తమ్మినేని సీతారామ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: