ఆ పోస్టులు భర్తీ చేయండి.. జగన్ గుడ్ న్యూస్?
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు నేడు కింద జరుగుతోన్న పనులు ప్రగతిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత సీఎం సమీక్ష నిర్వహించారు. నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై సమావేశంలో సీఎం చర్చించారు.
క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలని.. సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని సీఎం జగన్ సూచించారు. స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్‌ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర పోషించాలని సీఎం జగన్ అన్నారు. స్కూళ్లకు, అంగన్ వాడీలకు బియ్యాన్ని సరఫరా చేసే ముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఆహారాన్ని రుచిగా వండడంపై వంట మనుషులకు తగిన తర్ఫీదు ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలని సీఎం జగన్ సూచించారు. చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ సూచించారు. గుడ్ల పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలన్నారు. స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. నాడు నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలని సీఎం జగన్ ఆదేశించారు.