సజ్జలను అంత మాట అనేసిన చంద్రబాబు?

సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రస్తుతం వైసీపీలో సీనియర్ నేత.. జగన్ కు సన్నిహితుడు.. అంతకుముందు సాక్షి పత్రికలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టు. అయితే.. ఇటీవల గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆ విషయం నిపుణులు తేలుస్తారని.. కానీ.. చంద్రబాబు బ్రీఫ్డ్ మీ ఆడియో విషయంపై ఇంతవరకూ చంద్రబాబే క్లారిటీ ఇవ్వలేదని విమర్శించారు.

ఇప్పుడు ఆ విషయంపై స్పందించిన చంద్రబాబు.. సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. గోరంట్ల విషయంపై తాను ప్రశ్నిస్తే.. సాక్షిలో గుమస్తాగా పనిచేసే వ్యక్తి కూడా నా గురించి మాట్లాడుతున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క ఎన్నికలోనూ గెలవలేని గుమస్తా 7ఎన్నికల్లో గెలిచిన నాగురించి మాట్లాడతాడా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరం తిరగలేమమని.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి అనేవాడు తప్పు చేసిన వారిని మందలించి, దండిస్తే, మిగిలిన వాళ్లకు భయం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు భూకబ్జాలు లాంటివి పెరిగిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీరుతోనే సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నారని.. రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి రాష్ట్రంలో ఉండటం దుర్మార్గమని చంద్రబాబు ఆవేశపడ్డారు.

అంత వరకూ బాగానే ఉన్నా.. అసలు సజ్జల అడిగిన విషయం గురించి మాత్రం చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు.. రాష్ట్ర విభజన జరిగిన తొలిరోజుల్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు కోసం చంద్రబాబు రేవంత్ రెడ్డిని స్టీఫెన్ సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యే వద్దకు పంపారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. కానీ వాటిపై చంద్రబాబు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సజ్జలను అన్నిమాటలు అన్నా.. అసలు విషయం మాత్రం బయటపెట్టలేదు చంద్రబాబు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: