అమెరికా అధ్యక్షుడికి షాక్ ఇచ్చిన సౌదీ యువరాజు?

అమెరికా అధ్యక్షుడు అంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద వీఐపీ.. ఆయన రాకను ఎన్నో దేశాలు కోరుకుంటాయి. అయితే.. అంతా అలా ఉండరు.. కొందరు అలాంటి వీఐపీని కూడా డోంట్‌ కేర్ అంటారు. సౌదీ యువరాజు అలాంటి వారిలో ఒకరు. ఇటీవల తన దేశ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడికి ఆయన ఎలాంటి షాక్ ఇచ్చారో తెలిస్తే నిజంగానే షాక్‌ అవ్వాల్సిందే.

ఇటీవల సౌదీ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అక్కడ భలే ఇబ్బంది తలెత్తింది. రష్యా వ్యతిరేక కూటమిలోకి సౌదీని లాగడంలో జో బైడెన్‌ విఫలమయ్యారు. సౌదీ అరేబియాలో అడుగుపెట్టిన బైడెన్‌కు మొదట అక్కడి యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత రెండున్నర గంటలపాటు వీరి సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలో మానవ హక్కుల గురించి యువరాజు వద్ద బైడెన్‌ చెప్పబోయారట. వాషింగ్టన్‌ పోస్టు కాలమిస్టు జమాల్‌ ఖషోగ్జీ హత్య కేసు విషయాన్ని బైడెన్‌ ప్రస్తావించేందుకు యత్నించారట.

అంతే.. బైడెన్‌కు దీటుగా బదులిచ్చిన సౌదీ యువరాజు ఖషోగ్జీ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేశారట. అంతే కాదు.. అదొక అసహ్యకరమైన ఘటనగా అభివర్ణించారట. అంతే కాదు.. బైడెన్‌ లేవనెత్తిన మానవ హక్కులు, విలువలపై కూడా సౌదీ యువరాజు ఘాటుగా స్పందించారట. సౌదీ అరేబియా కూడా...మానవహక్కులను గౌరవిస్తుందని మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అన్నారు.

అయితే.. అమెరికా విలువలను ఎదుటి వారిపై రుద్దాలనుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని సౌదీ యువరాజు తేల్చి చెప్పారు. తమ విలువలు తమకుంటాయన్న ప్రిన్స్‌... అవి అమెరికా విలువలను పోలి ఉండవని చెప్పేశారు. అంతే కాదు.. తమ ఆచారాల పట్ల గర్వ పడతామని కూడా సౌదీ యువరాజు వాటికి అనుగుణంగా తమకంటూ సొంత విలువలు, నమ్మకాలు ఉన్నాయని బైడెన్‌కు షాక్ ఇచ్చారు. ఈ మెుత్తం విషయాన్నిసౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్ బిన్‌ సల్మాన్‌ మీడియాకు చెప్పుకొచ్చారు. సౌదీ రాజు సల్మాన్‌ అనారోగ్యంతో ఉండటంతో యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్ ప్రస్తుతం అనధికారిక రాజుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: