ఆ విషయంలో కేజ్రీవాల్‌ శీలాన్నే శంకిస్తున్నారుగా?

అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత.. దేశంలో విలువలు ఉన్న పార్టీగా పేరుంది. ఇటీవల పంజాబ్‌లోనూ సర్కారు ఏర్పాటు చేసిన ఈ పార్టీ.. అక్కడ ఓ మంత్రి కమీషన్ అడిగినట్టు తేలిందని.. ఏకంగా మంత్రి పదవి నుంచే పీకేశారు.. సొంత ప్రభుత్వమే అరెస్టు చేయించింది. అలాంటి నిజాయితీ పార్టీగా పేరున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత  కేజ్రీవాల్‌ శీలాన్నే ఇప్పుడు బీజేపీ శంకిస్తోంది.

ఎందుకంటే.. తాజాగా హవాలా కేసులో అరెస్టయిన దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను కేజ్రీవాల్‌ సమర్థిస్తున్నారు. తమ మంత్రిపై తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారని కేజ్రీవాల్ , ఆప్‌ నేతలు మాట్లాడుతున్నారు. దీంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శల దాడిని పెంచింది. మనీ లాండరింగ్‌ కేసులో నేరుగా ప్రమేయం ఉన్న మంత్రిని ఎందుకు రక్షిస్తున్నారని  కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడడమంటే....... దేశానికి వెన్నుపోటుతో సమానమని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ చెబుతారని స్మృతి ఇరానీ గుర్తు చేశారు.

మరి అలాంటి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఇప్పుడు మోసగాడిగా నిరూపితమైన మంత్రిని ఎందుకు కాపాడుతున్నారని స్మృతి ఇరానీ ప్రశ్నించతారు. ఈ మేరకు స్మృతి ఇరానీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు 10 ప్రశ్నలు సంధించారు. అంతే కాదు.. సత్యేందర్‌ జైన్‌పై వచ్చిన
ఆరోపణలకు సంబంధించిన పలు వివరాలను స్మృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు. సత్యేందర్‌ జైన్‌, ఆయన కుటుంబసభ్యుల పేరిట నాలుగు షెల్‌ కంపెనీలు ఉన్నట్లు ఇరానీ వివరించారు.

సత్యేంద్ర జైన్ హవాలా ఆపరేటర్ల ద్వారా ఏకంగా 16కోట్ల 39 లక్షల రూపాయలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని స్మృతి ఇరానీ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ నిజమా కాదో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ చెప్పాలని మంత్రి స్మృతి ఇరానీ నిలదీస్తున్నారు. అవినీతిపరుడైన మంత్రికి ఓ న్యాయమూర్తి మాదిరిగా కేజ్రీవాల్‌ క్లీన్‌ చిట్‌ ఇవ్వడమేంటని స్మృతి ఇరానీ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: