వచ్చీ రావడంతోనే చైనాకు వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్?
చైనా యథాతథ స్థితిని మార్చకుండా చూసేందుకు భారత సైన్యం సదా సన్నద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అంటున్నారు. రెండేళ్ల క్రితం చైనా ఏకపక్షంగా, రెచ్చగొట్టే ధోరణితో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే విమర్శించారు. ఈ చర్యలను భారత్ దీటుగా తిప్పికొట్టిందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి ఇప్పుడు సాధారణంగానే ఉందని... అక్కడ యథాతథ స్థితిని మార్చే పేరుతో మన ప్రత్యర్థి చైనా ఏకపక్షంగా, రెచ్చగొట్టేధోరణితో బలవంతంగా చేపట్టిన చర్యలకు మనం కూడా తగిన విధంగానే స్పందించామని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు.
ఎల్‌ఏసీ వద్ద మన సైన్యం అప్రమత్తంగా శాంతంగా ఉండి యథాతథ స్థితి మారకుండా భరోసా ఇస్తోందన్న ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే .. సైన్యానికి అదనపు ఆయుధాలను, బలగాలను పంపించామి తెలిపారు. యుద్ధ, రవాణా అవసరాలను తీరుస్తున్నామని.. ఎల్‌ఏసీ వెంట ఉద్రికత్తలను తగ్గించి, వీలైనంత త్వరగా యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు నిరంతరం పని చేయడమే తమ లక్ష్యం అని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు.
యథాతథ స్థితిలో మార్పు లేకుండా చూడడం తమ ప్రధాన విధి అన్న ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే .. మన భూభాగాన్ని కోల్పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగుతోందని.. ఇరుదేశాలు పరస్పరం చర్చించుకుంటేనే పరిష్కారం లభిస్తుందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అంటున్నారు.