శభాష్ జగన్.. ఇలాగే దూసుకెళ్లు?
అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చే బాధ్యత నాది అంటున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని హామీ ఇస్తున్నారు. సొంతిల్లు లేని కుటుంబం ఉండబోదని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటున్నారు. ఇచ్చిన మాట కంటే మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు కట్టించి తీరతామని శపథం చేస్తున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఇళ్లు అందిస్తామంటుున్నారు.
మంచి మాటే. నిన్న అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో లేఔట్ ప్రాంభించారు. అక్కడ ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని... ఒక్కొక్కరికి సెంట్ స్థలం ఇస్తున్నామని తెలిపారు. ఇక్కడ గజం స్థలం రూ.12 వేలు ఉందని.. అంటే స్థలం విలువే అక్షరాలా 6 లక్షలు అందని జగన్ గుర్తు చేశారు. ఇళ్లను ఇవ్వడం ద్వారా పేదలకు ఒక సామాజిక హోదా కల్పించినట్లు అవుతుందన్నది వాస్తవం.
ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు.. మొత్తం కలిపి పది లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని.. అంతా ప్రభుత్వం భరించి పేదలకు అందిస్తోందని జగన్ అన్నారు. నిజంగా ఇది మంచి కార్యక్రమం.. కేవలం మాటల్లో కాకుండా నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని నిరుపేద లేని రోజు రావాలి.. అదే జరిగితే అంతకు మించి కావాల్సిందేముంది. శభాష్.. జగన్..ఇలాగే ముందుకెళ్లు..!