చంద్రబాబు ఆరోజు విచారణకు రావాల్సిందేనా?

రాష్ట్ర మహిళా కమిషన్‌ను అడ్డుకున్నారన్న కారణంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 27 న చంద్రబాబుతో పాటు టీడీపీ నేత బోండా ఉమ కూడా తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనని వాసిరెడ్డి పద్మ మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై ఆమె మండిపడ్డారు. బాధితురాలికి భ‌రోసా ఇవ్వడానికి వ‌చ్చిన‌ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్సన్ను బెదిరిస్తారా అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.


అత్యాచార బాధితురాలి గదిలో చంద్రబాబు కేకలు వేస్తారా.. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో ప్రవర్తించే తీరు ఇదేనా అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ నిలదీశారు. చంద్రబాబు తప్పనిసరిగా  27వ తేదీన క‌మిష‌న్ ముందుకువ‌చ్చి స‌మాధానం చెప్పాల్సిందేనని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ  అన్నారు. చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన ప‌నికి స‌మ‌న్లు ఇవ్వక‌పోతే.. చ‌ప్పట్లు కొడ‌తారా అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ  ప్రశ్నించారు.


చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారన్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ.. ఇప్పుడు మహిళా కమిషన్ డమ్మీ కాదు.. మహిళా కమిషన్ అత్యంత శక్తివంతమైనదన్నారు. ఈ నెల 27 ఉదయం11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా వ‌చ్చి స‌మాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అలాగే.. మహిళా కమిషన్‌పై బోండా ఉమా స్వయంగా ఆరోపణలు చేస్తున్నాడని.. మహిళా కమిషన్ సుప్రీమా అని అడుగుతున్నాడని అన్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ.. అవును, కమిషన్ నీలాంటి ఆకు రౌడీల‌కు సుప్రీమే అని తేల్చి చెప్పారు.


మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమేనన్నమహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌  వాసిరెడ్డి పద్మ  ఇలాంటి నేరాలు ఎవరూ చేసిన క్షమించేది లేదన్నారు. బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్యలో వచ్చారని..  మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: