టీడీపీలో ఎప్పుడూ లేనంత కసి ఎందుకొచ్చింది... ఆ సడెన్ మార్పు వెనక కథ ఏంటి..!
మహిళా విభాగం, తెలుగు యువత, ఎస్సీ విభాగం, బీసీ విభాగం.. ఇలా.. అన్ని విభాగాలు కూడా దూకుడుగా పనిచేస్తున్నాయి. ఎస్సీ విభాగం నుంచి ఎం.ఎస్. రాజు చాలా బాగా పనిచేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రా ష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నెల 28న విజయవాడ లో భారీ ప్రదర్శన, సమావేశాలకు కూడా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ ఆయనిప్పటికే జిల్లాల్లో పర్యటించి.. ఎస్సీ యువతను పార్టీవైపు ఆకర్షించే పనిచేస్తున్నారు.
అదేవిధంగా తెలుగు మహిళా విభాగం తరఫున కూడా వంగలపూడి అనిత.. తనదైన శైలిలో మహిళా సమస్యలపై చర్చిస్తున్నారు. ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వడంలోనూ.. బాధిత మహిళలను ఆదుకోవడంలోనూ ఆమె ముందున్నారు. అదేవిధంగా బీసీ విభాగం కూడా చాలా యాక్టివ్‌గా పనిచేస్తోంది. పార్టీతరఫున అనేక కార్యక్రమాలను నిర్వ హిస్తోంది. ఇక, తెలుగు యువత అధ్యక్షుడు.. కూడా పార్టీని పుంజుకునేలా చేస్తున్నారు. పార్టీని యువతలోకి తీసుకువెళ్లడంతోపాటు.. డిజిటల్ ప్రచారం కూడా చేస్తున్నారు.
ఇక పార్టీలో మిగిలిన అనుబంధ సంఘాలు , యువత కూడా బాగా కసితో పని చేస్తున్నారు. వీరు మామూలుగా యుద్ధం చేయడం లేదు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. చంద్రబాబు నాయకత్వం మళ్లీ అధికారంలోకి రావాలనే కసితో వీరంతా పనిచేస్తుండడం గమనార్హం. అయితే.. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో బాగానే పనిచేస్తున్నా.. సీనియర్లు ఏం కొంప ముంచుతారోనని.. యువతలోపెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తుండడం గమనార్హం. మరి చంద్రబాబు.. ఏం చేస్తారోచూడాలి.