న్యాయ వ్యవస్థపై జగన్ యుద్ధం పీక్స్‌కు వెళ్లిందా?

ఏపీ సీఎం జగన్.. మొండివాడన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఒకటి డిసైడ్ అయితే ఎంత వరకైనా వెళ్తాడన్న విషయం మరోసారి రుజువు అవుతోంది. న్యాయ వ్యవస్థ పక్షపాతం వహిస్తోందంటూ ఆయన గతంలోనే యుద్దం ప్రారంభించారు. ఇప్పడు ఆ యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఇటీవల మూడు రాజధానుల అంశంపై హైకోర్టు జగన్ సర్కారుకు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అసలు రాజధాని అంశంపై రాష్ట్రం చట్టం చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. నెల రోజుల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వాలని.. ఆరు నెలల్లో అమరావతి కట్టాలని కూడా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీనిపై ఏపీ అసెంబ్లీలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీఎం జగన్ కోర్టుల వైఖరిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. హైకోర్టుపై తనకు అచంచలమైన గౌరవం ఉందంటూనే హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి మరీ తీర్పు ఇచ్చిందనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉందని..అది తమ బాధ్యతని అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో చెప్పడం ద్వారా తమ విధానాన్ని జగన్ స్పష్టం చేశారు.  ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగాన్నేకాకుండా శాసనసభ అధికారాలనే ప్రశ్నార్థకం చేస్తోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి, శాసన అధికారాలకు విరుద్ధమని వెల్లడించారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేస్తుందా అని ప్రశ్నించిన జగన్.. అలా అయితే శాసన వ్యవస్థకు అర్థం ఉండదన్నారు.

న్యాయవ్యవస్థ పరిధులను దాటిందని.. ఇది వాంచనీయంకాదని, స్వాగతించదగ్గ పరిణామం కూడాకాదని సీఎం పేర్కొనడంతో చూస్తే హైకోర్టుతో ఢీ అంటే ఢీ అని పోరాడేందుకు జగన్ రెడీ అన్నట్టుగానే ఉంది. హైకోర్టును కించపరిచేందుకు సభను నిర్వహించడంలేదన్న జగన్‌.. అదేసమయంలో అసెంబ్లీ అధికారికారాలను పరిరక్షించుకోవాల్సిన, గౌరవించాల్సిన బాధ్యత కూడా శాసనవ్యవస్థకు ఉందన్నారు. మొత్తానికి కోర్టులతో జగన్ పోరాటం పీక్స్‌ చేరినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: