ఉక్రెయిన్‌ : రష్యా, అమెరికా టెక్నాలజీ యుద్ధం..?

ఇది ఆధునిక యుగం.. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ యుగం.. ఈ తరంలో టెక్నాలజీ ఉన్నవాళ్లదై పైచేయి.. ఈ విషయం యుద్ధాల సమయంలోనూ నిరూపితం అవుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి దిగిన సంగతి తెలిసిందే.. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక వార్తలు రోజూ చూస్తుంటాం. గతంలో ఇలా వార్తలు చూడాలంటే.. చాలా పరిమితమైన అవకాశాలు ఉండేవి.. వింటే రేడియోలోనో.. లేదా టీవీలో వార్తలు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పడు సోషల్ మీడియా వచ్చేశాక.. సమాచార ప్రవాహం కొత్త పుంతలు తొక్కుతోంది.

ఇలా కొత్త పుంతలు తొక్కే ఈ సమాచార ప్రవాహన్నే సింపుల్‌గా సోషల్ మీడియా అని పిలుచుకోవచ్చు. ప్రపంచమంతా ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ నుంచి కనీసం తల ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. మరి ఇంతలా స్మార్ట్ ఫోన్‌లో ఆకర్షిస్తున్నవి ఏంటి.. ఫేస్‌ బుక్, వాట్సాప్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కొత్త  పుంతలు తొక్కుతున్న యుద్ధం  చివరకు ఈ సోషల్ మీడియాను కూడా తాకుతోంది.

ఈ సోషల్ మీడియాలో ఫేస్‌ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి అన్నీ అమెరికా నుంచి పని చేసేవే.. గూగుల్, యూట్యూబ్‌ కూడా అమెరికా కేంద్రంగానే పని చేస్తాయి. వీటి ద్వారానే తాజా న్యూస్ ప్రజలకు చేరుతోంది. దాన్ని బట్టి ప్రపంచం అంతా అంచనాలు వేసుకుంటోంది. మరి అలాంటి  సామాజిక మాధ్యమాలను కూడా యుద్ధం ప్రభావితం చేస్తోంది. అమెరికా తన చేతిలో ఉన్న సంస్థలతో రష్యాపై పరోక్షంగా యుద్దం చేస్తోంది.

అందుకే ఇప్పుడు యూట్యూబ్ వంటివి రష్యా ఛానల్లను బంద్ చేస్తోంది. దీనికి ప్రతిగా అన్నట్టు రష్యా ఈ సోషల్ మీడియాను బహిష్కరిస్తోంది. సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమై తాము ప్రపంచంలో విలన్‌ గా కనిపిస్తున్నామన్న కోపం రష్యాకు ఉంది. అంటే ఒక విధంగా చూస్తే రష్యా, అమెరికా క్రమంగా టెక్నాలజీతో యుద్దం చేస్తున్నాయి. తమకు అనుకూలమైన ప్రచారం ప్రపంచమంతా జరగాలని కోరుకుంటున్నాయి. ఆధునిక యుద్ధ రంగంలో ఇదీ ఓ రణ తంత్రమేనేమో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: