జగన్ సాక్షిగా : విశాఖలో కొత్త చరిత్ర?
సాధారణంగా నౌకాదళం నిర్వహించే ఇలాంటి ఉత్సవాలు.. పూర్తిగా నౌకాదళం ఆధ్వర్యలోనే జరుగుతుంటాయి. కానీ.. తొలిసారిగా నౌకాదళం మిలాన్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తోంది. ఇది నౌకాదళం చరిత్రలోనే అని చెబుతున్నారు. ఈ చారిత్రక కార్యక్రమం ఏపీ సీఎం జగన్ సాక్షిగా జరగడం విశేషంగానే చెప్పాలి. ఇక మిలాన్ ఉత్సవాలల్లో ప్రదర్శించిన యుద్ధ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
విశాఖలో.. సాగర తీరంలో మిలాన్ 2022 వేడుక బాగా జరిగింది. మొత్తం 39 దేశాలకు చెందిన వివిధ దేశాలకు చెందిన నౌకలు పాల్గొంటున్న ఈ మిలాన్ ఉత్సవాలలో తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకుంటోందని సీఎం జగన్ స్వయంగా ప్రస్తావించారు. విశాక బీచ్‌లో యుద్ధ హెలికాప్టర్లు, మిగ్ విమానాలు చేసిన విన్యాసాలు విశాఖ వాసులను మంత్రముగ్దులను చేశాయి. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ తో పాటు ఏపీ సీఎం జగన్, స్పీకర్, మంత్రులు.. ఇలా కీలమైన వ్యక్తులు ఈ విన్యాసాలను ఆసాంతం ఆసక్తిగా చూశారు.
ఈ ఉత్సవాల సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్.. విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా.. మిలాన్ వేడుకలు జరుగుతున్నాయని మెచ్చుకున్నారు. నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం వేదికవడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్ వేల సబ్ మెరైన్ రాకతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం మొదలైందని సీఎం జగన్ అన్నారు. నౌకల విన్యాసాలు ప్రజలకు ఉత్సాహంతో పాటు... సైనిక శక్తిపై ప్రజలకు మరింత విశ్వాసం పెంపొందిస్తాయని జగన్ అన్నారు.