మోదీని ఢీకొంటున్న ఆ నలుగురు..?
అలా ప్రధాని పీఠం అలంకరించిన మోడీకి ఇప్పుడు దేశంలో ఎదురు లేకపోయింది.. ఎదురు లేదు అని చెప్పే కంటే.. ఆయనకు ధీటుగా కనిపించే నాయకుడు లేడు అని చెప్పడం కరెక్ట్ అవుతుంది. కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీ మాత్రమే దిక్కు కావడం.. ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు ఇంకా రెడీ కాకపోవడం మోడీకి కలసివచ్చే అంశాలు. అలా ఇప్పట్లో మోడీని ఢీకొట్టే జాతీయ స్థాయి నేత కనిపించడం లేదు.
అయితే.. అలాగని మోడీకి ఎదురు లేదా.. మోడీని ఢీకొనేవారే లేరా.. అంటే ఉన్నారనే చెప్పాలి.. కానీ వారి బలం మాత్రం మోడీని ఢీ కొట్టేందుకు సరిపోదు.. అలాంటి బలమైన నాయకులంతా కేవలం వారి ప్రాంతాలకే పరిమితం కావడం వారి బలహీనత.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ లేడీ టైగర్ అని చెప్పొచ్చు. వరుసగా మూడో సారి ఆమె అధికారంలోకి వచ్చిందంటే.. ఆ పవర్ అర్థం చేసుకోవచ్చు.. ఇక తెలంగాణలో కేసీఆర్.. ఆయన కూడా రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చాడు.. మరోసారి వచ్చేందుకు కూడా పెద్దగా అడ్డంకులేమీ లేవు.
మూడో వ్యక్తి.. స్టాలిన్.. ఇటీవలే సీఎం పదవి చేపట్టినా స్టాలిన్‌కు అధికార క్రీడ కొత్త కాదు.. వయోధికుడైన తండ్రి కరుణానిధిని ముందు ఉంచి రాజకీయం నెరిపిందంతా ఆయనే.. ఆ తర్వాత శివసేన నేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా మోడీకి ఇప్పుడు వ్యతిరేకంగానే ఉన్నారు. అలా మమత, కేసీఆర్, స్టాలిన్, ఉద్దవ్.. ఈ నలుగురు సీఎంలు మోడీపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మరి వీరి పోరాటం గెలుస్తుందా.. వారు ఐక్యంగా పోరాడగలరా.. మోడీ ఆటకట్టించగలరా.. అంటే ఇప్పుడే ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కానీ.. ఏమో ఏమైనా జరొగచ్చు అన్న భావనైతే ఉంది.