ఉద్యోగుల సమ్మెపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్..?
గతంలో ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతామని హామీలిచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏనాడు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఒకవైపు జీతాలు పెంచామని చెబుతుంటారు.. మరోవైపు వారి జీతాల్లో కోత విధిస్తుంటారు. ఇది పూర్తిగా ఉద్యోగులను మోసం చేయడమేనని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు చెప్పినందుకే ఈ అంశంపై తాను మౌనంగా ఉన్నానని చెప్పారు.
ఉద్యోగుల విజ్ఞప్తికి కట్టుబడి ఉన్నందునే ఇప్పటి వరకు ఈ అంశంపై మాట్లాడలేదని పవన్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను కూడా వంచించిందని చెప్పారు. లక్షల మంది ఉద్యోగులు మండుటెండలో రోడ్లపైకి వచ్చారని కానీ.. వారికి న్యాయం మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఉద్యోగుల పోరాటంలో వారివైపే జనసేన ఉంటుందని.. ఉద్యోగులంతా కలసి కట్టుగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పవన్ కల్యాణ్ అంటున్నారు.