హైకోర్టులో పీఆర్సీ పిటీషన్.. ఎంత డ్రామా నడిచిందో..?
ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .. ఈ వ్యాజ్యం ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వద్దకు వచ్చింది . అయితే.. కోర్టులో వాదనల ప్రారంభ సమయంలో ఏజి ఎస్ శ్రీరామ్ జోక్యం చేసుకున్నారు. రిట్ నిబంధన 14 ( ఏ ) ( 6 ) ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించాలని సూచించారు. దీంతో ఈ వ్యాజ్యం ఏ బెంచ్ వద్దకు విచారణకు రావాలో సీజేనే తేల్చాలని నిర్ణయించారు.
ఇది కేవలం ఒక ఉద్యోగి సర్వీసు వ్యవహారంలో దాఖలు చేసిన వ్యాజ్యం మాత్రమేనని .. వేతన సవరణ జీవోతో వ్యక్తిగతంగా అన్యాయం జరిగిందని తన పిటిషనర్ వ్యాజ్యం వేశాడన్నారు. మరోవైపు పీఆర్సీ జీవోను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస చైర్మన్ కేవీ కృష్ణయ్య కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు . అయితే.. ఈ కేసు మొదట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా దగ్గరకు రావాల్సి ఉంది.
అయితే.. పరిపాలన నిర్ణయం తీసుకునేందుకు ఫైలు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. చివరకు సీజే ఈ ఫైల్ పై పరిపాలనపరమైన నిర్ణయం వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి వద్దకు విచారణకు వచ్చేలా కేటాయించారు . ఇందులో ఏజి రిట్ నిబంధనల గురించి ప్రస్తావించడంతో ఫైల్ మళ్లీ సీజే చేతికి వెళ్లింది.