ఏపీలో కొత్త జిల్లాలు.. మరో లైన్‌ క్లియర్..?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చురుకుగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆన్ లైన్లోనే మంత్రుల నుంచి ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. ఆన్ లైన్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు పంపిన ప్రభుత్వం.. వారితో ఆమోద ముద్ర వేయించుకుంది.

మంత్రుల ఆమోదంతో కొత్త జిల్లాల ఏర్పాటునకు రంగం సిద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై  2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక  ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక్కో జిల్లాగా మారుస్తామని వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా విభజిస్తారా..లేక.. మరో ప్రాతిపదక ఏర్పాటు చేస్తారా అన్న తేలాల్సి ఉంది. భౌగోళిక విస్తీర్ణత దృష్ట్యా కొన్ని ఎంపీ స్థానాలను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే ఆలోచన లేకపోలేదు.

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే.. భౌగోళిక విస్తీర్ణం దష్ట్యా అరకు నియోజకవర్గాన్ని మాత్రం రెండు జల్లాలుగా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే పెరిగిన జ‌నాభాకు అనుగుణంగా ప‌రిపాల‌నను ప్రజలకు చేరువ చేయాలన్నది జగన్ సర్కారు లక్ష్యం.. అందుకు ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవ‌స‌ర‌మ‌ని వైసీపీ ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అందుకు అనుగుణంగా ఈ జిల్లాల విభజన ప్రక్రియకు రంగం పూర్తిగా సిద్ధం అవుతోంది. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కొత్త జిల్లా ఏర్పాటుపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: