ఆయన గ్రాఫ్‌ పెంచుతున్న కేసీఆర్‌.. స్కెచ్‌ అదిరిందిగా..?

తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రత్యేకించి టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్న సీన్ కొన్ని రోజులుగా కనిపిస్తోంది. రెండు, మూడు నెలలుగా అధికార పార్టీపై బీజేపీ అనేక అంశాల్లో.. అనేక రీతుల్లో పోరాడుతోంది. దీనికి తోడు హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌ అభ్యర్థని ఓడించడంతో ఆ పార్టీ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత బీజేపీ తెలంగాణలో దూకుడు పెంచింది. ఇదే జోరు కొనసాగిస్తే తెలంగాణలో అధికారం సాధ్యమని ఆ పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. ఇది బీజేపీ వైపు నుంచి ఉన్న ఆలోచన.

అయితే.. కేసీఆర్ కావాలనే బీజేపీని ప్రమోట్ చేస్తున్నారని మరో వాదన కూడా ఉంది. తెలంగాణలో బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ.. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడినా  ఆ పార్టీ ఇంకా గ్రౌండ్‌ లెవల్లో బలంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనం కేసీఆర్‌పై మొహం మొత్తిన సమయంలో తెలంగాణలో  ప్రజలకు గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పకతప్పదు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారని.. తెలంగాణలో ముక్కొణపు పోరు జరిగితే తనకు లాభం అని కేసీఆర్ భావిస్తున్నాడన్న విశ్లేషణ కూడా ఉంది.

ఈ విశ్లేషణను తార్కాణమే హుజూరాబాద్ ఉపఎన్నిక. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మూడూ పోటీ చేసినా పోరు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మధ్యే జరిగింది. కాంగ్రెస్ బలమైన పార్టీ అయినా సరే జనం పట్టించుకోలేదు. ఇలా పోరు వన్‌ టు వన్ జరిగితే తనకు దెబ్బ అన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించారు. అందుకే.. బీజేపీ కూడా బలపడితే అప్పుడు ముక్కోణపోరులో తాను లాభపడొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

అందుకే తరచూ బండి సంజయ్‌పై విమర్శలు చేయడం.. బండి సంజయ్‌ ను అరెస్టు చేయడం.. బీజేపీయే తమకు ప్రధాన ప్రతిపక్షం అన్న బిల్డప్ ఇవ్వడం కూడా కేసీఆర్ స్కెచ్‌లో భాగమే అన్న వాదన ఉంది. అందుకే కేసీఆర్ బండి సంజయ్‌ను హీరోను చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న  అనుమానం ఉంది. తాజా పరిణామాలూ అదే సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: