బిగ్‌షాక్‌: మోడీకి పిచ్చెక్కింది.. అమిత్‌షా కామెంట్స్..?

ప్రధాని నరేంద్ర మోడీ మతి స్థిమితం కోల్పోయారా.. ఆయన అదుపుతప్పి పరుషంగా మాట్లాడుతున్నారా.. ఆయన తరచు సంయమనం కోల్పోతున్నారా.. అవునట.. ఈ విషయం ఎవరో చెబితే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.. ఏదో గిట్టనివాళ్లు చెబుతున్నారులే అనుకోవచ్చు.. కానీ ఈ వ్యాఖ్యలు చేస్తున్నది సొంత పార్టీ నేతలు.. అందులోనూ గవర్నర్‌ పదవిలో ఉన్న వ్యక్తి.. అది కూడా మోడీకి మతిస్థిమితం లేదని స్వయంగా అమిత్‌ షానే అన్నారట. ఇది నిజమే అయితే.. చాలా ఆలోచించాల్సిన విషయమే.

అసలేం జరిగిందంటే.. మేఘాలయ  గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ ఇటీవల ప్రధాని మోదీని కలిశారు. అప్పుడు రైతు ఉద్యమం గురించి.. 600 మంది రైతుల మరణాల గురించి చర్చ వచ్చిందట.. 600 మంది రైతులు మరణిస్తే మీరు కనీసం సంతాపం కూడా తెలపలేదని సత్యపాల్ మాలిక్ అన్నారట.. దీంతో కోపం వచ్చిన మోదీ.. ఏం.. వాళ్లంతా నాకోసం చనిపోయారా..అని అహంకారంగా మాట్లాడారట. ఈ విషయంపై మాట్లాడాలనుకుంటే అమిత్‌ షాను కలవండి అని చెప్పి మోదీ సమావేశం ముగించేశారట.

మోదీ మాట మేరకు సత్యపాల్ మాలిక్ అమిత్‌ షాను కలిసి.. జరిగింది చెప్పారట.. అప్పుడు అమిత్‌ షా ఇలా అన్నారట. ఆయనకు.. అంటే మోదీకి మతి తప్పిందని... కొందరు ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారని అమిత్‌షా వాపోయారట. ఏదో రోజు మోదీకి వాస్తవం బోధపడుతుందని... మీరు ఇవేం పట్టించుకోకుండా మమ్మల్ని కలుస్తూ ఉండండి అని షా సత్యపాల్ మాలిక్‌తో అన్నారట. మరి సత్యపాల్ మాలిక్ వంటి సొంత పార్టీ నేత.. అందులోనూ మోదీ గురించి అబద్దం చెప్పే అవకాశం తక్కవ.

అయితే.. అంతర్గత సమావేశాల్లో ఏదోదో మాట్లాడుతుంటారు.. వాటిని బహిర్గతం చేయడం కూడా అంత సబబు కాదేమో.. కానీ.. ఈ సంభాషణలే అసలు వ్యక్తుల నిజస్వరూపాలను బయటపెడుతుంటాయి. సత్యపాల్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశం కావడంతో ఆయన కాస్త వెనక్కు తగ్గారు. మోదీ గురించి అమిత్‌షా చెడు ఉద్దేశంతో ఆలాంటి వ్యాఖ్యలు చేయలేదని పొడిపొడి వివరణ ఇచ్చి తప్పించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: