హ్యాపీ సండే : ఆగిన కేసు.. ఆఖ‌రు కేసు లెక్క తేల్చుగురూ!


కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలి. ఈ ఏడాది భారత్ ఎవరూ ఊహించ నంత ఉన్నతంగా ఉండాలి. భారత న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై పరిశోధన జరగాలి.  పూర్తిస్థాయిలో కేసులపై దృష్టి సారించాలి. అన్నింటినీ మించి జరగాల్సింది ఒకటుంది. అదేంటో తెలుసా ? ఒక్కసారి లోనికి వెళ్లి చూద్దాం రండి....
న్యాయ వ్యవస్థ లో ఎంత మంది ఉండాలి ? అన్న విషయంపై ఒక్కసారి గణించి.... న్యాయస్థానాలు మరింత క్రియాశీలంగా వ్యవహరించడానికి ఎంతమంది న్యాయమూర్తులు అవసరమో అన్న విషయం ఖచ్చితంగా అంచనా వేయాలి . ఏ దశలోనూ,  ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయమూర్తుల కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి.  న్యాయ స్థానాల మౌలిక నిర్మాణాలు మెరుగుపరచాలి. ఇలా చేస్తే  కోర్టుల సామర్థ్యం మరింత మెరుగ్గా పెంపొందించవచ్చు. కోర్టు గదుల్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. భూమి రికార్డులు తో పాటు,  ప్రభుత్వ  రికార్డులన్నింటినీ  కంప్యూటరీకరించాలి.  ఇది కొన్ని రాష్ట్రాల్లో కొంత మేర జరుగతోంది.  కానీ పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ జరగలేదు. అదే సమయంలో న్యాయ వ్యవహారాలన్నీ కూడా కంప్యూటర్ ద్వారానే జరిగేలా చూడాల్సి ఉంది.  విభిన్న చట్టాల ద్వారా అస్తిత్వంలో కి వచ్చిన,  నియంత్రణ యంత్రాంగాలను  సమీక్షించాలి.
అంతేనా...ఇంకేమన్నా ఉందా ?... న్యాయమూర్తులు, న్యాయవాదులూ  తమ పరిజ్ఞానాన్ని మెరుగు పరచుకునేందుకు ఉపయోగమయ్యే సదస్సులలో పాల్గోని, వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి. అంతే కాదు ఇది నిరంతర ప్రక్రియ కావాల్సిన అవసరం ఉంది. విదేశాలలో వాణిజ్యపరమైన చట్టాలలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిపై  మనదేశంలోని వారికి కూడా పరిచయం కల్పించాలి. ప్రస్తుతం భారత్ లో పన్నులు విధించే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. ఇటువంటి చర్యలపై ఏ పౌరుడైనా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించే రితిలో, ఇంకా చెప్పాలంటే జవాబుదారీతనం తో కూడిన అంబుడ్స్ మెన్ ను నియమించాలి. అన్నింటినీ మించి పేరుకుపోయిన కేసుల బూజు దులపాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: