దిగాలుగా బిజేపి.... ఎందుకో తెలుసా ?


అతి కొద్ది కాలంలోనే అంటే  ఏడెనిమిది  నెలల కాలంలో ఇంత మార్పు వస్తుందని బహుశా భారతీయ జనతాపార్టీ ఉహించి ఉండక పోవచ్చు.  ఈ ఏడాది మే నెలలో జరిగిన శాసన సభ ఎన్నికలలో వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టి.ఎం.సి) ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెఱువుల నీరు తాగించిన పార్టీ భారతీయ జనతా పార్టీ . తాజాగా ఆ పార్టీ నేతలు దిగాలుగా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 144 స్థానాలకు గాను 134 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ( టీఎంసీ ) ఆధిపత్యాన్ని కొనసాగించింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ  మూడు స్థానాలను గెలుచుకుంది. వామపక్షాలు, కాంగ్రెస్‌లు చెరో రెండు గెలిచాయి.
ఆదివారం జరిగిన పోలింగ్‌లో 40.5 లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు. టిఎంసి మొత్తం 18,87,422 ఓట్లను సాధించగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 2,52,610 ఓట్లతో రన్నరప్‌గా నిలిచింది, బిజెపికి 2,41,053 ఓట్లు వచ్చాయి. మే 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నుంచి టి.ఎం.సి  ఓట్ల వాటా 11 శాతం పెరిగింది,  అదే సమయంలో బిజేపి ఓట్ల శాతం 20 పడిపోయింది. గతంలో అంటే 2015లో జరిగిన కోల్‌కతా కార్పోరేషన్ ఎన్నికల్లో 124 సీట్లు గెలుచుకున్న దానికంటే ఈసారి  టి.ఎం.సికి  22 శాతం ఎక్కువ ఓట్లు సాధించింది. బీజేపీ గతసారి కంటే 6 శాతం తక్కువ ఓట్లు సాధించింది.
మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల  సమయంలో బిజేపి ఊపందుకుంది.  న్యూఢిల్లీ నుంచి స్టార్ క్యాంపెయినర్లను తాజా ఎన్నికల్లో మిస్సయింది. పౌర ఎన్నికల ప్రచారాలలో ఎక్కువ భాగం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సుకాంత మజుందార్, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి,  జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ నేతృత్వంలో జరిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సెప్టెంబర్ 20న అధ్యక్షుడిగా నియమితులైన మజుందార్‌కు ఇది మొదటి ఎన్నికల సవాలును ఎదుర్కోన్నారు.
మజుందార్  మీడియాతో మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదు. మీడియా దీనిని వోటింగ్ అంటోంది, కానీ ఇదొక ప్రహసనం. విస్తృతంగా రిగ్గింగ్ జరిగింది, ప్రభుత్వ వ్యతిరేక గొంతులు మూగబోయాయి. సీపీఐ(ఎం)కి రెండో స్థానం దక్కేలా చేయడం ద్వారా టీఎంసీ ఓటర్లకు  భ్రమ కల్పించింది. కుట్రలు పన్నింది.  మేము  టి.ఎం.సికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము  అంతేకాదు, వారిని అధికారం నుండి తొలగిస్తాము అంటూ బింకాలు పలికారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన గొంతు చాలామార్లు  గద్గదమవడం మీడియా దృష్టి నుంచి తప్పించుకోలేపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: