షాక్: గుడిలో పెళ్లి చేసుకున్న కుంభమేళ మోనాలిసా..!

Divya
గత ఏడాది ఉత్తరప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళలో పూసలమ్ముకుంటూ ఒక్కసారిగా ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే గురించి చెప్పాల్సిన పనిలేదు. దీంతో సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకుంది. ఇటువంటి తరుణంలో ఈమె తాజాగా వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తో కలిసి ఆమె వైవాహిక బంధం లోకి మార్చి 11వ తేదీన అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కేరళలోని ఉన్న నైనార్ ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి కేరళ మంత్రులు సిపిఎం నాయకులు హాజరైనట్లు సమాచారం.



ప్రస్తుతం మోనాలిసా పెళ్లికి సంబంధించి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమాలలో పలు రకాల యాడ్స్ తో బిజీగా ఉన్న మోనాలిసా ఇలా సడన్గా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరి ప్రేమను ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరిదీ వేరువేరు మతాలు కావడం చేత ఇలా  వివాహం చేసుకున్నారు.


మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ తన పెళ్లిని వ్యతిరేకించారని , ఈ సమయంలోనే ఒక సినిమా షూటింగ్ కోసం కేరళకు వచ్చిన మోనాలిసా తండ్రి కూడా అక్కడికి వచ్చి ఆమెతో గొడవ పడ్డారట. దీంతో ఈ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. మోనాలిసా తండ్రి విజయ్ తాను చూపించిన అబ్బాయినే వివాహం చేసుకోవాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులో తెలియజేసింది. అయితే తాను మేజర్ అని తనకి ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకుంటానంటూ పోలీసులకు తెలియజేసింది మోనాలిసా. దీంతో ఆమెకు భద్రత కల్పిస్తూ పోలీసుల సమక్షంలోనే వివాహం చేసుకోవడం ఇప్పుడు చర్చనియంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: