రెచ్చిపోతున్న బాబు.. జగన్‌కు డేంజర్ సిగ్నల్స్..?

చంద్రబాబు.. దేశంలోనే సీనియర్ నాయకుడు.. కానీ ప్రస్తుతం ఆయనకు కాలం కలసిరావడం లేదు. ఏ ఎన్నికల్లోనూ ఇటీవల చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ విజయం సాధించడం లేదు. చివరకు చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ వైసీపీ జండా ఎగిరింది. మరి ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చే అసెంబ్లీ నాటికి టీడీపీ పరిస్థితి ఏంటి.. ఇది చాలా మందిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. అయితే.. అనూహ్యంగా కొన్ని రోజులుగా చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.

ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలు.. చంద్రబాబు పార్టీ ఆఫీసుపై దాడి.. ఆయన ఢిల్లీ యాత్ర.. ఆ తర్వాత అసెంబ్లీ పరిణామాలు.. ఇప్పుడు రాయల సీమను ముంచెత్తిన వరదలు..ఇలా వరుస పరిణామాలతో చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతోంది. ఎందుకంటే.. చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంతే కాదు.. మారుమూల పల్లెలకు కూడా వెళ్తూ.. వారి బాధలు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు పర్యటనలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది.

రెండు రోజుల పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన పూర్తి చేసుకున్నారు. బుధవారం దాదాపు అర్థరాత్రి వరకూ చంద్రబాబు పర్యటన కొనసాగింది. దాదాపు అర్థరాత్రి సమయంలో నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన  ముగిసింది. వరద ముంపు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ చంద్రబాబు పర్యటన సాగింది. విచిత్రం ఏంటంటే.. రాత్రి 11గంటల తర్వాత కూడా జనం పెద్ద సంఖ్యలో చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారు.

ఇదే సమయంలో వరదల్లో చనిపోయిన విద్యార్థి గోపి కుటుంబానికి రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. గౌరవ సభను కౌరవ సభగా మార్చినందుకే తాను అసెంబ్లీకి వెళ్లట్లేదన్న చంద్రబాబు.. మళ్లీ గౌరవ సభగా అసెంబ్లీ మారినప్పుడే మళ్లీ సభలో అడుగుపెడతానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇలా ప్రజల్లోకి దూసుకెళ్తున్న చంద్రబాబు.. వైసీపీ కి ఒక విధంగా డేంజర్ సిగ్నల్స్ ప్రారంభించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: