ప‌వ‌న్ అంటే ప‌వ‌ర్ : దేవుడు అనొద్దు ప్లీజ్ !

RATNA KISHORE
ప‌వ‌న్ ఎంద‌రికో స్ఫూర్తి

ఆయ‌న న‌ట‌న క‌న్నా

వ్య‌క్తిత్వం అంటేనే ఎక్కువ మందికి ఇష్టం



అభిమానులంతా పండుగ చేసుకునే రోజు.. హోర్డింగులూ..క‌టౌట్లూ ఒక‌టే సందడితో రోజంతా గ‌డిపే రోజు. ఆయ‌న వ‌స్తే ట్రెండ్ సెట్ చేయ‌డ‌మే త‌రువాయి.. భీమ్లా నాయిక్ ఆ పనే చేస్తాడు..గ‌బ్బ‌ర్ సింగ్ ఆ ప‌నే చేశాడు. తన‌దైన మార్క్ తో ఫ్యాన్స్ ను అల‌రించ‌డం ప‌వ‌న్ మానియాలో భాగం. అవును భ‌క్తులుంటారు ఆయ‌న‌కు..అభిమానులు కాదు..ఉండాల్సిన వాళ్లు ఉన్నా, ఉండ‌క‌పోయినా భ క్తులే ఉంటారు..ఇదీ హ‌రీశ్ శంక‌ర్ మాట‌.. చాలా మంది భ‌క్తులు ఆయ‌న‌ను దేవుడ్ని చేశారు కానీ ఆయ‌న అలాంటివి వ‌ద్దే వ‌ద్ద‌ని అంటారు. మీరు మీలా ఉండండి చాలు. న‌న్నుదేవుడ్ని చేయొద్దు. దేవుడ్ని చేసి ప్ర‌త్యేక‌తలేవీ ఆపాదించ‌వ‌ద్దు ప్లీజ్..అని అంటారు.




ప‌వ‌న్ ఎలా ఉంటారు స‌ర్ అని మీరు ఎవ్వ‌రినయినా అడిగి చూడండి..ఇలా స‌మాధానం చెబుతారు. ఆయ‌న సున్నిత మ‌నస్కు లు.ఎవ్వ‌రికి ఏం క‌ష్టం వ‌చ్చినా స్పందిస్తారు. అంద‌రూ అనుకునేవిధంగా ఆయ‌న ద‌గ్గ‌ర బిల్డ‌ప్పులు ఏవీ ఉండ‌వు. సామాన్యుడి గానే ఉంటారు. ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. త‌న‌కున్న వ్య‌వ‌సాయ క్షేత్రంలో సంబంధిత ప‌నులు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ధ్యానం చేయ‌డం ఇష్టం. పుస్త‌కాలు చ‌దువుతారు. ఎక్కువ‌గా త‌న ప్ర‌పంచంలో తానే ఉంటారు. ఇత‌రుల‌ను క‌ల‌వరు. క‌లిసినా వారితో ఎక్కువ సేపు గ‌డిపేందుకు ఇష్ట‌ప‌డ‌రు. సినిమా అవార్డుల ఫంక్ష‌న్ల‌కు ఆయ‌న రారు. ఆయ‌న ఎంతో ఇష్ట‌ప‌డిన ఆర్టిస్టు బాపు. ఆయ‌న తీసిన శ్రీ‌రామ రాజ్యం సినిమాకు మాత్ర‌మే వ‌చ్చి మాట్లాడి వెళ్లారు. ఆయ‌న మాట్లాడ‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం కొంత బిడియ‌మే. ఆయ‌న భ‌య‌స్తులు కొన్ని సార్లు..కొన్ని సార్లే ధైర్యం చేసి మాట్లాడ‌తారు..అని చెబుతారు ప‌వ‌న్ ను ద‌గ్గ‌ర గా ప‌రిశీలించిన వ్య‌క్తులు. ప్ర‌భుత్వాస్తుల‌ను ధ్వంసం చేస్తే ఒప్పుకోడు. ఒక‌వేళ అందుకు త‌న అభిమానులు కార‌ణం అయితే సంబంధిత వ‌ర్గాల‌కు ఫోన్ చేసి క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు. ప‌రిహారం చెల్లిస్తాడు. బాధ్య‌త‌గా ఉంటాడు..ప‌వ‌న్ అని చెబుతారు ఇంకొంద‌రు స‌న్నిహితులు. ఇప్ప‌టికీ ఖాకీ డ్రెస్సు అంటే ఆయ‌న‌కు ఎంతో గౌర‌వం ఆ గౌర‌వంతోనే సినిమాలు ..అందుకే అంటారు నేను కాదు దేవుడ్ని త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క చేయ‌క పౌరుల ర‌క్ష‌ణ‌లో నిరంత‌రం శ్ర‌మించే పోలీసులూ, సైనికులే దేవుళ్లు అని.. ఈ మాట ఎన్నో సార్లు చెప్పారు. కానీ అభిమానులు మాత్రం ఆయ‌న‌ను దేవుడ్ని చేస్తారు. ఈ ఒక్క‌టే ఆయ‌న‌కు ఎంతో ఇబ్బందిక‌రం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: