రాజీవ్ ఖేల్ రత్న వద్దు.. మరి మోడీ స్టేడియం ఎందుకో..?
ఇప్పుడు ఈ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం వివాదాస్పదం అవుతోంది. ఈ ఖేల్‌రత్న పేరు మారుస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. రాజీవ్ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారంగా మారుస్తున్నట్టు మోడీ ప్రకటించారు. అయితే ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు చేశారు.. దీనికి కారణాలేంటి.. దీనికి కూడా మోడీ జవాబు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నరు మోడీ.
ఈ రాజీవ్ ఖేల్ రత్నకు పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గుర్తుగా 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు ఇస్తున్నారు. ఈ అవార్డీలకు ఒక ప్రశంసా పత్రం, పతకం, నగదు పురస్కారం ఇస్తారు. మరి ఉన్నట్టుండి ఈ పేరు మార్చడం ఏంటి.. ఇంతకీ ఈ పేరు మార్చమని ఎవరు విజ్ఞప్తి చేశారు.. చేస్తే రాజీవ్ గాంధీ పేరు పట్ల వారి అభ్యంతరం ఏంటి అన్న అంశాలను మోడీ తన ప్రకటనలో వివరించలేదు.
సరే.. మోడీ నిర్ణయం మంచిదే అనుకుందాం.. అసలు క్రీడా అవార్డుకు ఓ రాజకీయ నాయకుడు పేరు ఎందుకని మోడీ భావించి ఉండొచ్చనుకుందాం.. మంచిదే.. రాజీవ్ ఖేల్ రత్న బదులు ధ్యాన్‌చంద్ ఖేల్ రత్నయో బావుంది.. అయితే మరి గుజరాత్‌లో నిర్మించిన ఓ అంతర్జాతీయ స్టేడియానికి నరేంద్ర మోడీ పేరు ఎందుకు పెట్టారు. మోడీ ఏ ఆటగాడని ఈ పేరు పెట్టారు. రాజీవ్ ఖేల్ రత్న పేరు మారుస్తున్నప్పుడు మోడీకి ఈ విషయం ఎందుకు గుర్తు రాలేదు.. ఇవన్నీ ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు.. మరి మోడీ దగ్గర సమాధానం ఉందా..?