మోదీ మెడకు మూడో ముప్పు.. కేసీఆర్ బ్లాక్‌ మెయిలింగ్ అందుకేనా..?

దేశంలో మోడీ ప్రతిష్ట రోజురోజుకూ తగ్గిపోతోంది. మరోవైపు.. విపక్షాలు చాలాచోట్ల బలం పుంజుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేకపోయినా.. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ వంటి వారు రాజకీయంగా బలంగా తయారవుతున్నారు. ఇలాంటి వారంతా మోడీకి వ్యతిరేకంగా ఒక్కటైతే.. పొలిటికల్ సీన్ మారిపోయే ప్రమాదం ఉంది. వీరంతా థర్డ్ ఫ్రంట్‌గా గట్టిగా ఏర్పడితే.. అది మోడీకి ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి.
అటు చూస్తే కేసీఆర్ కూడా ఆ మధ్య జాతీయ స్థాయిలో పార్టీలను కూడగడతా అని సంచలన ప్రకటన చేసినా.. ఢిల్లీ వెళ్లొచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతానికి కేసీఆర్ బీజేపీ పెద్దలపై కామెంట్లు చేయడం లేదు. అయితే రోజురోజుకూ పడిపోతున్న గ్రాఫ్ కారణంగా మోడీ టీమ్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. థర్డ్ ఫ్రంట్ అంటూ ఓ టీమ్ తయారు కాకుండా ప్రయత్నిస్తోంది. కేసీఆర్ వంటి నాయకులు ఆ మూడో ఫ్రంట్‌ వైపు వెళ్లే మోడీకి డేంజర్. అందుకే.. కేసీఆర్ కాళ్లకు కేసుల బూచి చూపి బంధం వేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఇందుకు తాజాగా బండి సంజయ్ ఓ ఛానళ్లో చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బండి సంజయ్ ఏమన్నారంటే.. “ కేసీఆర్, టీఆర్‌ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి పూర్తిగా సేకరించాం.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌పై సహారా, ఈఎస్ఐ కేసుల లిస్టు ఉంది.. కేసీఆర్‌కు సంబంధించి వారం రోజులుగా కేసుల మీదే దృష్టి పెట్టాం.. ఈదెబ్బతో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం.. ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఇంత పెద్ద అవినీతి పరుడు తేలిపోయింది.. ఇప్పటికే టీఆర్ఎస్  18మంది ముఖ్యనేతలపై  లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం..అంటూ కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఇది వార్నింగ్ కాదు.. బ్లాక్ మెయిలింగ్ అంటే కరెక్టుగా ఉంటుందేమో. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్లకుండా చూసేందుకే ఈ కేసుల పేరుతో బ్లాక్ మెయిలింగ్ మొదలైందేమో అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కరోనా టీకాల విషయంలో టీఆర్ఎస్ మంత్రులు కాస్త ఘాటుగానే మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే బండి సంజయ్‌తో కేసీఆర్‌కు సంకేతాలు పంపించారా అన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: