కృష్ణపట్నం ఆనందయ్య మందు.. సోషల్ మీడియా విజయం..!
ఇదో వండర్ మెడికల్ మిరాకిల్ అంటున్నారు. అనేక జాతీయ పత్రికల్లో ఈ కరోనా మందుపై ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. మరి ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఆనందయ్య గురించి అంతగా ప్రపంచానికి ఎలా తెలిసింది. ఆయనేమీ పేపర్లో, టీవీల్లో యాడ్లు ఇచ్చుకోలేదు. కనీసం టీవీల్లో కూడా ప్రచారం చేసుకోలేదు. మరి ఇంత ప్రచారం ఎలా సాధ్యం అంటే.. కేవలం సోషల్ మీడియా.. కేవలం వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారానే కృష్ణపట్నం ఆనందయ్య గురించి ఒకరికొకరికి తెలిసింది.
ఓ సినిమా బావుంటే మౌత్ పబ్లిసిటీ ఎలాగో..ఇదీ అలాగే.. అందుకే ఈ కృష్ణపట్నం ఆనందయ్య విజయం అంటే అది సోషల్ మీడియా విజయమే. ఇప్పుడు సోషల్ మీడియా అండతో కంటెంట్ ఉన్నవాడు ఎవడైనా కింగ్ అయిపోవచ్చు. మరి ఈ ఆనందయ్య దగ్గర కూడా చాలా మంచి కంటెంట్ ఉంది కదా. అవును. ఈ ఆనందయ్యకు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన రూపాయి కూడా ఫీజు తీసుకోడు. ఉచితంగానే మందు అందిస్తాడు.
అంతే కాదు.. చాలా మందిలా నా మందు నా ఫార్ములా అని గిరిగీసుకునికూర్చోడు. తాను మందు తయారీలో ఏం వాడతాడో కూడా ఓపెన్‌గా చెప్పేశాడు. కుదిరితే మీరే తయారు చేసుకోండని సూచిస్తాడు. మొత్తానికి సోషల్ మీడియా కారణంగా కృష్ణపట్నం ఆనందయ్య ఓ సెలబ్రెటీ అయిపోయాడు.